Asianet News TeluguAsianet News Telugu

Telangana Elections 2023: తెలంగాణ ప్రముఖ నేతలు ఎవరెవరు..ఎక్కడెక్కడ ఓటు వేయనున్నరంటే..? 

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. ఉదయం 7 గంటల నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఈ ఎన్నికల్లో రాజకీయ ఎవరెవరు ఎక్కడెక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారో మీకోసం.. 

Telangana Top political leaders to cast their votes in these polling stations KRJ
Author
First Published Nov 30, 2023, 4:19 AM IST

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. ఈ రోజు (గురువారం) ఉదయం 7 గంటల నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఈ ఎన్నికల్లో రాజకీయ ఎవరెవరు ఎక్కడెక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారో మీకోసం.. 

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో...

  • బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక స్వగ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.  సతీమణి శోభతో కలిసి కేసీఆర్ చింతమడక గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయనున్నారు. 
  • తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఎస్ఆర్ నగర్ లోని నారాయణ జూనియర్ కళాశాల, పోలింగ్ స్టేషన్ నంబర్ 188లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • మంత్రి కేటీఆర్ ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని నంది నగర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
  • మంత్రి హరీష్ రావు దంపతులు సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్ అంబిటస్ స్కూల్ లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
  • ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 లో గల బీఎస్ డీఏవీ పబ్లిక్ స్కూల్ లో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 
  • కాంగ్రెస్ ఎంపీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ లోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో పోలింగ్ బూత్ లో ఓటు వేయనున్నారు.
  • ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి దంపతులు కోదాడ లోని గ్రేస్ వ్యాలీ ఐడియల్ స్కూల్ లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
  • సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధిర పట్టణంలోని సుందరయ్య నగర్ మండల పరిషత్ పాఠశాలలో తన ఓటు వేయనున్నారు.
  • ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ పట్టణంలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
  • కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలోని బూత్ నెంబర్ 160లో తన ఓటును వేయనున్నారు.
  • ఎమ్మెల్యే జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) సంగారెడ్డి పట్టణంలో తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
  • ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గం కాటారం మండలం ధన్వడా గ్రామంలో ఓటు వేయనున్నారు.  
  • ఎమ్మెల్యే సీతక్క ములుగు మండలంలోని జగ్గన్నపేటలో తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 
Follow Us:
Download App:
  • android
  • ios