Exit polls 2023 : సాయంత్రం ఐదున్నరకు ఎగ్జిట్ పోల్స్ కు ఈసీ అనుమతి
ఎగ్జిట్ పోల్స్ కు సమయాన్ని తెలిపారు ఎన్నికల అధికారులు. వివిధ సర్వే సంస్థలు చేసే ఎగ్జిట్ పోల్స్ ను ఎప్పుడు విడుదల చేయాలో క్లారిటీ ఇచ్చారు.
హైదరాబాద్ : తెలంగాణ లో గురువారం ఉదయం నుంచి పోలింగ్ జోరుగా సాగుతోంది. పోలింగ్ ప్రారంభమై ఐదుగంటలు గడిచిపోయింది. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. దీనిమీద ఎలక్షన్ కమిషన్ క్లారిటీ ఇచ్చింది. సాయంత్రం ఐదున్నరకు ఎగ్జిట్ పోల్స్ కు అనుమతినిచ్చింది. ఆయా సర్వే సంస్థలు ఈ ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేయనున్నాయి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పడిన తరువాత ఇది మూడోసారి అసెంబ్లీ ఎన్నికలు జరగడం. ఈ ఎన్నికల్లో కూడా ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని అధికార బీఆర్ఎస్ భావిస్తోంది. హ్యాట్రిక్ సాధించాలని చూస్తోంది. ఇక మరోవైపు ఓటర్లు మార్పు కోరుకుంటున్నారంటూ బరిలోకి దిగిన కాంగ్రెస్ కూడా గెలుపు తమదే అన్న ధీమాతో ఉంది. తెలంగాణలో మరో ప్రతిపక్షమైన బీజేపీ కూడా ఈసారి తెలంగాణలో మొదటిసారి బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెబుతోంది.
ఈ క్రమంలోనే ఈ సారి తెలంగాణ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గురువారం ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. అక్కడక్కడా చెదురుమదురుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వీటిని పోలీసులు అదుపులోకి తీసుకువచ్చారు. ఎప్పట్లాగే రాజధాని హైదరాబాద్ లో తక్కవు శాతం పోలింగ్ నమోదవుతోంది.
Telangana Exit poll Results 2023:తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎప్పుడంటే?