Mizoram Exit polls 2023 : మిజోరంలో మళ్లీ ఎంఎన్ఎఫ్‌దే అధికారం .. బీజేపీ, కాంగ్రెస్‌లకు నిరాశే

40 అసెంబ్లీ స్థానాలున్న మిజోరంలో ఎంఎన్ఎఫ్ ప్రస్తుతం అధికారంలో వుంది. గత ఈ ఎన్నికల్లో ఈ పార్టీ 26 స్థానాలను గెలుచుకోగా.. ఈసారి మాత్రం ఈ సంఖ్య 18కి పరిమితమవుతుందని పలు సంస్థలు అంచనా వేశాయి. కాంగ్రెస్ క్రితంసారి మాదిరిగానే 5 స్థానాలనే గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి.
 

Mizoram Exit Poll Results 2023: Will Zoramthanga Return to Power As CM Again ksp

ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, తెలంగాణలలో ఇవాళ్టీతో ఎన్నికలు ముగిశాయి. డిసెంబర్ 3న ఈ ఐదు రాష్ట్రాల్లో ఒకసారి ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. కోట్లాది మంది ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. అయితే ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించి జాతీయ మీడియా సంస్థలు, ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేస్తున్నాయి. దీనిలో భాగంగా ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో పరిస్ధితులు చూస్తే. ఇక్కడ అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) మరోసారి విజయం సాధిస్తుందని పలు సర్వేలు అంచనా వేయగా.. జోరమ్ పీపుల్స్ మూమెంట్ (జెడ్‌పీఎం)దే గెలుపని మరికొన్ని సంస్థలు పేర్కొన్నాయి. 

ALso Read : Telangana Exit polls 2023: తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా

40 అసెంబ్లీ స్థానాలున్న మిజోరంలో ఎంఎన్ఎఫ్ ప్రస్తుతం అధికారంలో వుంది. గత ఈ ఎన్నికల్లో ఈ పార్టీ 26 స్థానాలను గెలుచుకోగా.. ఈసారి మాత్రం ఈ సంఖ్య 18కి పరిమితమవుతుందని పలు సంస్థలు అంచనా వేశాయి. కాంగ్రెస్ క్రితంసారి మాదిరిగానే 5 స్థానాలనే గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి.

మిజోరంలో పలు సంస్థల సర్వేల అంచనాలు ఇలా :

ఏబీపీ సీ ఓటర్ : ఎంఎన్ఎఫ్ 15 - 21 , జెడ్‌పీఎం 12 - 18, కాంగ్రెస్ 2 - 8
జన్‌కీ బాత్ : ఎంఎన్ఎఫ్ 10 - 14, జెడ్‌పీఎం 15 - 25, బీజేపీ 0 - 2, కాంగ్రెస్ 5 - 9
ఇండియా టీవీ సీఎన్ఎక్స్ : ఎంఎన్ఎఫ్ 14 -18, జె‌డ్‌పీఎం 12 - 16, బీజేపీ 0 - 2, కాంగ్రెస్ 8 - 10 
పీపుల్స్ పల్స్ సర్వే : ఎంఎన్ఎఫ్ 16 -20, జెడ్‌పీఎం 10 - 14, బీజేపీ 6 - 10, కాంగ్రెస్ 2 - 3
టైమ్స్‌నౌ ఈటీజీ : ఎంఎన్ఎఫ్ 14 - 18, జెడ్‌పీఎం 10 - 14, ఇతరులు 9 - 15

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios