Telangana Assembly Elections 2023:ముగిసిన పోలింగ్, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటరు తీర్పు
తెలంగాణలో పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది.
హైదరాబాద్: తెలంగాణలో పోలింగ్ ముగిసింది. ఐదు గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఎన్నికల సంఘం అనుమతిని ఇచ్చింది. రాష్ట్రంలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు గంటలకే పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే.
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇవాళ పోలింగ్ జరిగింది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. నాలుగు గంటలకే 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ పూర్తైంది. ఐదు గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు హక్కును నమోదు చేసుకొనే అవకాశం ఉంది.
also read:Pilot Rohit Reddy పీఏపై సాయిపూర్‌లో దాడి:కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ, లాఠీచార్జీ
తెలంగాణలో మూడో దఫా అధికారాన్ని బీఆర్ఎస్ దక్కించుకుంటుందా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ దఫానైనా హస్తగతం చేసుకుంటుందా అనే విషయమై డిసెంబర్ 3న తేలనుంది. మరో వైపు దక్షిణాదిలో తెలంగాణలో కమల వికాసం జరగనుందా లేదా అనే విషయమై ఆదివారం నాడు తేలనుంది. ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో భద్రపర్చారు.
ఈ దఫా ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవాలని ఈ మూడు పార్టీలు అన్ని అస్త్రాలను ప్రయోగించాయి. అయితే ఓటరు దేవుడు ఎవరిని కరుణిస్తారో డిసెంబర్ 3న తేలనుంది. తెలంగాణలో అధికారం దక్కించుకొనేందుకు మూడు పార్టీలకు చెందిన అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.