నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు, సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన ఏపీ పోలీసులు..

నాగార్జున సాగర్ నీటిని విడుదల చేయడంలేదంటూ సాగర్ దగ్గర ఏపీ పోలీసులు ఘర్షణకు దిగారు. డ్యాం గేట్లను ధ్వంసం చేశారు. 

Breaking news : AP Police destroyed the gates of Nagarjunasagar Dam and CCTV cameras - bsb

నాగార్జున సాగర్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం మరోసారి చెలరేగింది. దీంతో గురువారం తెల్లవారుజామున నాగార్జున సాగర్ డ్యాం దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఒక్కసారిగా 700 మంది ఏపీ పోలీసులు డ్యామ్ మీదికి చొరబడ్డారు. ఏపీ పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు, సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. విషయం తెలియడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు తెలంగాణ పోలీసులు. ఏపీ పోలీసులను అడ్డుున్నారు. నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేయడం లేదని గతంలోనూ ఏపీ పోలీసులు ఘర్షణకు దిగారు. దీంతో సాగర్ పై తెలంగాణ ఏపీ పోలీసుల మధ్య ఘర్షణ ఏర్పడింది.  నాగార్జున సాగర్ డ్యాం 13వ గేటు దగ్గర ఏపీ పోలీసులు ముళ్లకంచ వేశారు. ఈ వివాదం నేపథ్యంలో  ఏపీలోని పల్నాడులో పోలీసులు భారీగా మోహరించారు. వివాదం నేపథ్యంలో అధికారులు నీళ్లు విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. 

నాగార్జున సాగర్ డ్యాం 13వ గేటు దగ్గర ఏపీ పోలీసులు ముళ్లకంచె వేశారు. ఈ వివాదం నేపథ్యంలో  ఏపీలోని పల్నాడులో పోలీసులు భారీగా మోహరించారు. వివాదం నేపథ్యంలో అధికారులు నీళ్లు విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. నాగార్జునసాగర్ 26 డేట్లలో 13 గేట్లపై తమకు హక్కు ఉందని ఏపీ పోలీసులు చెబుతున్నారు. నాగార్జున సాగర్  రైట్ కెనాల్ నుంచి డ్యామ్ మీదికి ఏపీ పోలీసులు వచ్చారు. వారిని తెలంగాణ పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహణలో సాగర్ డ్యాం ఉంది. 

మరోవైపు ఈ ఘర్షణ మీద కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. నేడు పోలింగ్ ఉండగా.. రాత్రికి రాత్రి ఎప్పుడూ లేని వివాదాన్ని కొత్తగా తెరపైకి తీసుకువచ్చారని.. ఇదంతా నాగార్జున సాగర్ డ్యాం కేంద్రంగా కేసీఆర్ ఉద్వేగాలను రెచ్చగొడుతున్నారని, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios