telangana elections Polling 2023 : ఎమ్మెల్సీ కవితపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు...
ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీద ఎన్నికలసంఘానికి ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్ : బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఉదయం ఎమ్మెల్సీ కవిత ఓటు వేసిన తరువాత మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ఆమె బీఆర్ఎస్ కు ఓటు వేయాలని చెప్పినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ చైర్మన్ నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అని చెప్పుకొచ్చారు. ఉదయం కవిత మాట్లాడుతూ.. పారదర్శకతను చూడాలని అది అందించే బీఆర్ఎస్ కే ఓటు వేయాలని అన్నారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ వ్యాప్తంగా ఓటింగ్ జోరుగా సాగుతోంది. సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు. ఉదయం ఏడు గంటల వరకే అల్లుఅర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ఆయన తల్లి, సతీమణిలతో కలిసి జూబ్లీహిల్స్ క్లబ్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా భార్య సురేఖ, కుమార్తె శ్రీజలతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇక హీరో వెంకటేష్, కీరవాణిలు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మామూలుగా పోలింగ్ సమయంలో ఉదయం పదిగంటలు దాటితే కాసీ ఓటింగ్ కు బైటికి రాని సెలబ్రిటీలు ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ సారి ముందుకు వచ్చారు.