New Voters: మొదటి సారి ఓటు వేస్తున్నారా? అయితే.. ఈ రూల్స్ తప్పనిసరి తెలుసుకోవాల్సిందే !
Telangana Assembly Elections: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఓ వజ్రాయుధం. ఆ ఆయుధాన్ని ఉపయోగించుకుని తమకు నచ్చిన ప్రజాప్రతినిధులుగా గెలిపించుకోవచ్చు. తమకు నచ్చిన ప్రభుత్వాలను ఎన్నుకోవచ్చు. అలాంటి ఓటు హక్కు(Right to vote)నువినియోగించుకోవాలంటే.. ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ ఎన్నికల నియమాలను (Election Rules) తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. తొలిసారి మీరు ఓటు వేస్తున్నారు కాబట్టి.. ఓటు ఎలా వేయాలి? పోలింగ్ స్టేషన్ లోపల ఏం జరుగుతుంది? అనేది ఓ సారి చూద్దాం
Telangana Assembly Elections: తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానున్నది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాగనున్నది. ఈ సారి ఎన్నికల బరిలో 2,290 మంది ఉండగా.. వారి భవితవ్యాన్ని 3.26 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. అయితే.. అందులో దాదాపు 17 లక్షల మంది కొత్త ఓటర్లు తమ మొదటి ఓటు వినియోగించు కోనున్నారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 8 లక్షలకు పైగా కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకోవడం గమన్హారం
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఓ వజ్రాయుధం. ఆ ఆయుధాన్ని ఉపయోగించుకుని తమకు నచ్చిన ప్రజాప్రతినిధులుగా గెలిపించుకోవచ్చు. తమకు నచ్చిన ప్రభుత్వాలను ఎన్నుకోవచ్చు. అలాంటి ఓటు హక్కు(Right to vote)నువినియోగించుకోవాలంటే.. ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ ఎన్నికల నియమాలను (Election Rules) తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. తొలిసారి మీరు ఓటు వేస్తున్నారు కాబట్టి.. ఓటు ఎలా వేయాలి? పోలింగ్ స్టేషన్ లోపల ఏం జరుగుతుంది? అనేది ఓ సారి చూద్దాం..
పాటించాల్సిన నియయాలు..
- ఓటర్లు తమ పోలింగ్ బూత్‌ను కనుగొనడానికి electoralsearch.inకి వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. లేదా ఓటర్ హెల్ప్‌లైన్ నంబర్ 1950కి కాల్ చేసి అడగవచ్చు.
- పోలింగ్ కేంద్రానికి వెళ్లేటప్పుడు ఓటరు స్లీప్, ఓటరు గుర్తింపు కార్డు (Voter ID card)లేదా ఇతర గుర్తింపు కార్డును తమ వెంట తీసుకెళ్లాలి.
- పోలింగ్ బూత్ లోపలికి సెల్‌ఫోన్లు(Phones) తీసుకెళ్లకూడదు.
- పోలింగ్ కేంద్రాల వద్ద పార్టీల గుర్తులు, రంగులు కలిగిన బట్టలు, టోపీల వంటివి ధరించకూడదు.
- పోలింగ్ సమయంలో భద్రతా సిబ్బందికి పూర్తిగా సహకరించాలి.
- తొలుత పోలింగ్ కేంద్రం లోపల ఎన్నికల అధికారి వద్దకు వెళ్లి.. ఓటరు జాబితాలో తమ పేరును పరిశీలించుకోవాలి.
- మొదటి ప్రక్రియలో మీ వివరాలు సరైనవే.. వారి జాబితా సరిపోతే.. రెండో అధికారి దగ్గరికి పంపుతారు.
- ఆ అధికారి గుర్తింపు కార్డును పరిశీలించి.. మీ వేలుకు ఇంక్ అంటించి ఓ చీటీ ఇస్తారు.
- ఆ చీటీని తీసుకుని మూడో ఎన్నికల అధికారి దగ్గరికి వెళ్లాలి. అక్కడ ఆ అధికారి ఆ చీటిని, మీ గుర్తింపు కార్డును మరోసారి పరిశీలిస్తాడు.
- అనంతరం ఈవీఎం ఏర్పాటు చేసిన నిర్దేశిత ప్రదేశానికి పంపుతారు.
- ఈవీఎం ప్యాట్ లో సీరియల్ నంబర్, అభ్యర్థి పేరు, గుర్తు కనిపిస్తాయి.
- ఆ ఈవీఏంలో మీకు నచ్చిన లేదా మీరు ఎన్నుకోవాల్సి న అభ్యర్థి ఎదురుగా ఉన్న బ్లూ / నీలి రంగు బటన్ పై ప్రెస్ చేయాలి.
- ఆ బటన్ ను ప్రెస్ చేసిన అనంతరం దాని పక్కనే రెడ్/ ఎరుపు సిగ్నల్ వస్తుంది. అదే సమయంలో పెద్దగా బీప్ శబ్దం వినిపిస్తుంది.
- మీరు ఓటు వేసిన అనంతరం ఈవీఎం పక్కనే ఉన్న ఓటర్ వెరిఫైయబుల్ ఆడిట్ ట్రయల్ ( వీవీప్యాట్) నుంచి ఓ స్లీప్ బయటకు వస్తుంది.
- అలాగే.. షీల్డ్ బాక్స్ లోని గ్లాస్ బ్యాక్స్ లో మీరు ఎవరికి ఓటు వేశారో.. ఏడు సెకండ్ల పాటు కనిపిస్తుంది.
- మీరు ఓటు వేసిన అనంతరం బీప్ శబ్దం రాకపోయినా, బ్యాలెట్ స్లీప్ కనిపించకపోయినా అక్కడే ఉన్న ప్రిసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేయొచ్చు.
- ఈ ప్రక్రియ పూర్తి అయితే.. మీరు మీ ఓటును విజయవంతంగా నమోదు చేసుకున్నట్టు.
గమనిక.. పోలింగ్ కేంద్రంలోనికి మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను మీ వెంట తీసుకెళ్లకూడదు. ఒక వేళ తీసుకెళ్లినా.. అక్కడ ఫోటోలు సెల్ఫీలు తీసుకోవడం, వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడం వంటి పిచ్చి చేష్టాలు చేస్తే.. కఠిన చర్యలు తప్పవు.