ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ  రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో ఎంఐఎం బరిలో 9 చోట్ల ఆ పార్టీ  అధినేత విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 

హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సెయింట్ ఫయాజ్ స్కూల్ లో ఆలిండియా   మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ  గురువారంనాడు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తుంది.  పాతబస్తీతో పాటు జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానాల్లో కూడ  ఎంఐఎం పోటీ చేస్తుంది. తమ పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్న  స్థానాల్లో  ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ  విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 

తెలంగాణ రాష్ట్రంలో మూడో దఫా అధికారాన్ని దక్కించుకోవాలని  భారత రాష్ట్ర సమితి  ప్రయత్నిస్తుంది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండు దఫాలు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైంది. ఈ దఫా తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని  కాంగ్రెస్ పార్టీ  వ్యూహత్మకంగా ముందుకు వెళ్లింది. దక్షిణాదిలో తెలంగాణలో  అధికారాన్ని  దక్కించుకోవాలని  కమలదళం అడుగులు వేసింది. తెలంగాణ రాష్ట్రంపై   బీజేపీ జాతీయ నాయకత్వం కూడ  ఫోకస్ పెట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు ఆ పార్టీకి చెందిన అగ్ర నేతలు కూడ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.