ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్.. తన ప్రీపెయిడ్ కష్టమర్ల కోసం బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. తన ప్రీపెయిడ్‌ ప్లాన్‌లలో ఒకదానిని వొడాఫోన్‌ మరోసారి తిరిగి ప్రవేశపెట్టింది. రూ.597తో రీఛార్జ్‌ చేసుకుంటే 168రోజుల పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌ను పొందవచ్చు. అదే విధంగా రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు, ఆఫర్‌ కాలంలో మొత్తం 10జీబీ 4జీ డేటాను పొందవచ్చని వొడాఫోన్‌ తెలిపింది. అయితే స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు ఈ ఆఫర్‌ కాలపరిమితి 112 రోజుల్లో ముగుస్తుంది.

తాజా ఆఫర్‌ కింద వినియోగదారులు రోజుకు 250 లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ చేసుకోవచ్చు. అంటే 4గంటలా 10 నిమిషాల పాటు టాక్‌టైమ్‌ లభిస్తుంది. అదే విధంగా వారానికి కేవలం 1000 నిమిషాలు మాత్రమే వినియోగించుకునే వీలుంది. వొడాఫోన్‌ అన్ని 4జీ సర్కిళ్లకూ ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఇప్పటికే ఎయిర్‌టెల్‌ ఈ ఆఫర్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే.