Asianet News TeluguAsianet News Telugu

బీవేర్:14 ఏళ్ల బుడతడి సృష్టి..‘సెలెక్స్’ వైరస్‌తో టెక్ వరల్డ్ షేక్


ప్రపంచ వ్యాప్తంగా మోడెమ్‌లు, స్మార్ట్ టీవీలు పాడై పోతున్నాయి. యూరప్ కు చెందిన ఒ కుర్రాడు రూపొందించిన సైలెక్స్ సైలెక్స్‌ మాల్‌వేర్‌ టెక్ ప్రపంచాన్ని వణికిస్తున్నది. బ్రికర్ బాట్ తరహాలో ఇది ప్రపంచవ్యాప్తంగా ఐఓటీ పరికరాలను సర్వనాశనం చేస్తుంది. 

This virus created by 14-year-old is destroying modems, smart TVs and other devices globally
Author
New Delhi, First Published Jun 29, 2019, 10:48 AM IST

న్యూఢిల్లీ: 14 ఏళ్ల బుడతడు ఇద్దరు మిత్రులతో కలిసి యూరప్ కేంద్రంగా పని చేస్తూ ఇరాన్ సర్వర్ల నుంచి పని చేస్తున్నట్లు భ్రమించచేస్తూ టెక్ దిగ్గజాలకే షాక్‌లిస్తున్నాడు. ఈ 14 ఏళ్ల యూరప్ బాలుడు మరో ఇద్దరు మిత్రులతో కలసి వైరస్ సాఫ్ట్‌వేర్ ‘సైలెక్స్’ డేటా ఆధారంగా పనిచేసే ‘ఐఓటీ’ వస్తువులే లక్ష్యంగా ప్రపంచవ్యాప్త విధ్వంసం సృష్టిస్తోంది. 

 

మోడెమ్‌లు, స్మార్ట్‌ టీవీలు-ఫోన్లు, ట్యాబ్లెట్లు, మల్టీమీడియా ప్లేయర్లు, ‘ఏఆర్‌ఎం’ప్రాసెసర్లను పని చేయకుండా ఈ ‘సైలెక్స్’ వైరస్ చేస్తోంది. 2017లో ‘ఎంటీఎన్‌ఎల్‌’బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు స్తంభించి, న్యూఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడానికి కారణమైన ‘బ్రికర్‌బాట్’అనే మాల్‌వేర్‌ తరహాలోనే ఇది పనిచేస్తోంది. 

 

బ్రికర్‌బాట్‌ వైరస్ వల్ల అప్పట్లో బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన సుమారు 60 వేల మోడెమ్‌లు పనికిరాకుండా పోయాయి. ఈ విధ్వంసకరమైన మాల్‌వేర్‌ గురించి అకమాయి సెక్యూరిటీ నిఘా రియాక్షన్ టీం పరిశోధకుడు లారీ క్యాష్‌డాలర్‌ తొలిసారిగా మంగళవారం వెలుగులోకి తెచ్చారని జెడ్‌నెట్‌డాట్ కామ్‌ అనే వెబ్‌సైట్‌ తెలిపింది. 

 

డీఫాల్ట్‌ లాగిన్‌ వివరాలతో కూడిన యూనిక్స్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని ఈ మాల్‌వేర్‌ పనిచేస్తోందని అకమాయి సెక్యూరిటీ నిఘా రియాక్షన్ టీం పరిశోధకుడు లారీ క్యాష్‌డాలర్‌ చెప్పారు. ‘ఏఆర్‌ఎం’ ఆధారిత డీవీఆర్‌ లేదా 64 బిట్‌ సిస్టమ్‌ అయినా దీని ధాటికి ఆగలేవని పేర్కొన్నారు. 

 

‘తేలికపాటి పాస్‌వర్డులు గల ఐఓటీ వస్తువుల స్టోరేజీలోకి ముందు మాల్‌వేర్‌ ప్రవేశిస్తుంది. నెట్‌వర్క్‌ కాన్ఫిగరేషన్స్‌ను తీసేస్తుంది. యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ను పనికిరాకుండా చేసి, చివరకు సదరు వస్తువు ఫోన్, మోడెం, కంప్యూటర్ పనిచేయకుండా చేస్తుంది’అని అకమాయి సెక్యూరిటీ నిఘా రియాక్షన్ టీం పరిశోధకుడు లారీ క్యాష్‌డాలర్‌ వివరించారు. 

 

‘న్యూస్కై సెక్యూరిటీ రీసెర్చ్‌’కు చెందిన అంకిత్‌ అనుభవ్‌ కథనం ప్రకారం సైలెక్స్‌ను ముగ్గురు మిత్రులు సృష్టించారు. లైట్‌ లీఫన్‌ అనే రహస్యపేరు (సూడోనేమ్‌) పెట్టుకున్న 14 ఏళ్ల బాలుడు వీరికి సారథి. స్కిడ్డీ అనే తన మిత్రుడితో కలసి బ్రికర్‌బాట్‌ను స్ఫూర్తిగా తీసుకుని సైలెక్స్‌ను సృష్టించినట్లు చెప్పాడు. 

 

దీన్ని మరింత అభివృద్ధి చేసి భవిష్యత్‌లో ప్రతి టెక్నాలజీ పరికరాన్ని ప్రభావితం చేసేలా సైలెక్స్‌ను అభివృద్ధి చేస్తున్నానని లీఫన్‌ తెలిపాడు. తొలుత ఈ పనిని సరదాగా ప్రారంభించామని, ఇప్పుడు దీనిపైనే ఫుల్‌టైమ్‌ ప్రాజెక్టు వర్కు చేస్తున్నానని పేర్కొనడం గమనార్హం. 

 

ప్రపంచంలో వినియోగిస్తున్న ఉపకరణాల్లో 15 శాతం పరికరాలకు డీఫాల్ట్‌ పాస్‌వర్డులు, సులువుగా ఊహించే 12345 తరహా పాస్‌వర్డులు పెడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఈ వస్తువులే లక్ష్యంగా ప్రస్తుతం సైలెక్స్‌ పని చేస్తోంది. 

 

డీఫాల్ట్‌ పాస్‌వర్డులు లేనివాటిపై దీని ప్రభావం తక్కువగా ఉంటుంది. పాస్‌వర్డ్‌లు పెట్టిన వారు వాటిని వెంటనే పాస్‌వర్డులు మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పటికే మీ స్మార్ట్‌ఫోన్‌-టీవీ, మోడెమ్‌లు పని చేయకపోతే వాటిని పనికిరానివని పాడేయకుండా.. కొత్తవి కొనకుండా.. సంబంధిత కంపెనీని సంప్రదించి ఒరిజినల్‌ సాఫ్ట్‌వేర్‌ పొందితే సరిపోతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios