Asianet News TeluguAsianet News Telugu

అమేజాన్ లో డిస్కౌంట్ సేల్... స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమేజాన్ మరోసారి భారీ డిస్కౌంట్ సేల్ కి తెర లేపింది. ముఖ్యంగా ఎంఐ స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు ప్రకటించింది. ఎంఐ డేస్‌ పేరుతో షియోమి, రెడ్‌మి ఫోన్లపై రాయితీ ఇస్తోంది.

Mi Days sale begins: Xiaomi, Redmi phones sell with up to Rs 6,500 discount on Amazon
Author
Hyderabad, First Published Jun 17, 2019, 4:39 PM IST

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమేజాన్ మరోసారి భారీ డిస్కౌంట్ సేల్ కి తెర లేపింది. ముఖ్యంగా ఎంఐ స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు ప్రకటించింది. ఎంఐ డేస్‌ పేరుతో షియోమి, రెడ్‌మి ఫోన్లపై రాయితీ ఇస్తోంది. సోమవారం ప్రారంభమైన ఈ సేల్‌ జూన్‌ 21 వరకూ కొనసాగనుంది. వివిధ షామీ ఫోన్లపై రూ.6,500 వరకూ డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు తెలిపింది. దీంతోపాటు మొబైల్స్‌ ఎక్స్‌ఛేంజ్‌పై రూ.4000 వరకూ తగ్గింపు లభించనుంది. యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వినియోగదారులు అదనంగా మరో 5 శాతం డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు.

రెడ్ మీ7 స్మార్ట్ ఫోన్ ధర పై డిస్కౌంట్ ప్రకటించారు. ఈ ఫోన్ అసలు ధర రూ.10,999కాగా... ఆఫర్ లో దీనిని రూ.7,999కే పొందవచ్చు. 2జీబీ ర్యామ్, 23జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటే రూ.7,999కి, 3జీబీ ర్యామ్ అయితే.. రూ.8,999కే లభించనుంది.

రెడ్ మి వై3 స్మార్ట్ ఫోన్..ప్రారంభ ధర రూ.9,999గా ఉంది. 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ అంతర్గత మెమొరీ ఉన్న మొబైల్‌ రూ. 9,999కు కొనుగోలు చేయొచ్చు. 4జీబీ+64జీబీ వేరియంట్‌ ధర రూ.11,999కే లభించనుంది. 

రెడ్‌మి 6ఏపై రూ.1000 డిస్కౌంట్‌!
అమెజాన్‌ ఎంఐ డేస్‌ సేల్‌లో భాగంగా రెడ్‌మి6ఏ రూ.1,000 వరకూ డిస్కౌంట్‌ లభిస్తోంది. 2 జీబీ ర్యామ్‌ +16 జీబీ స్టోరేజ్‌ , 3 జీబీ ర్యామ్‌+ 32 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ మొబైల్స్‌ వరుసగా రూ.5,999, రూ.6,499 లభించనున్నాయి. అమెజాన్‌ పే బ్యాలెన్స్‌ ఉపయోగించి వినియోగదారులు అదనంగా మరో రూ.500 రాయితీ పొందవచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios