Asianet News TeluguAsianet News Telugu

ఫ్లిప్‌కార్ట్‌లో కొలువంటే ఇండియన్స్‌కెంతో ఇదీ.. వాటిల్లోనూ

భారతీయుల్లో అత్యధికులు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సంస్థల్లో పని చేయడానికి ఇష్ట పడుతున్నారు. అలాగే ఓయో సంస్థ ఉద్యోగులతోపాటు స్విగ్గీ, జొమాటో సంస్థల సిబ్బంది.. టీసీఎస్, రిలయన్స్ ఉద్యోగులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారని లింక్డ్ ఇన్ సంస్థ నిర్వహించిన సర్వే నివేదిక వెల్లడించింది. 

Flipkart Beats TCS, Google, Amazon To Become Most Preferred Tech Company For Indian Employees
Author
New Delhi, First Published Apr 4, 2019, 10:33 AM IST

న్యూఢిల్లీ: వాల్‌మార్ట్‌ ఆధీనంలోని ఈ-కామర్స్ రిటైలర్  ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగం చేయాలన్న ఆసక్తిని భారత్‌లో అధికులు వ్యక్తం చేస్తున్నారని వృత్తి నైపుణ్యాల సోషల్ మీడియా వేదిక లింక్డ్‌ఇన్‌ తెలిపింది. తరువాత స్థానాల్లో అమెజాన్‌ ఇండియా, ఓయో ఉన్నాయన్నది. ఈ జాబితా తొలి 10 స్థానాల్లో ఇంటర్నెట్‌ కంపెనీల ఆధిపత్యం ఉంది. 

ఇక ఆసియా బిలియనీర్ ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ కు టాప్ 10లో చోటు దక్కింది. రెండు, మూడు స్థానాల్లో ఓయో, అమెజాన్‌ నిలిచాయి. వన్‌97 అనే కంపెనీ నాలుగో స్థానంలో నిలిచింది. కొత్తగా ఈ జాబితాలో చేరిన ఉబెర్‌ మాత్రం, ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. 

భారత్‌లో ఉద్యోగులు పని చేసేందుకు ఎక్కువగా ఇష్టపడే కంపెనీల పేర్లతో సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌ సంస్థ లింక్డ్‌ఇన్‌ రూపొందించిన ‘2019 టాప్‌ కంపెనీస్‌ లిస్ట్‌ ఫర్‌ ఇండియా’ ఫోర్త్‌ ఎడిషన్‌ నివేదిక ఈ సంగతి బయటపెట్టింది. మరో గమ్మత్తైన విషయమేమిటంటే భారతీయ ఉద్యోగులు ఎక్కువగా ఇష్టపడుతున్న టాప్‌ 10 కంపెనీల్లో ఎక్కువ భాగం ఇంటర్నెట్‌ కంపెనీలే. 

ఈ ఏడాది ఐబీఎంతో పాటు, టాటా గ్రూప్‌నకు చెందిన ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు ఈ జాబితాలో ఏడో స్థానం లభించింది. ఈ రెండు కంపెనీలకు ఈ జాబితాలో చోటు లభించడం ఇదే తొలిసారి. 

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ స్విగ్గీ, జొమాటో కంపెనీల్లో పని చేసే ఉద్యోగులూ సంతోషంగానే ఉన్నారు. దీంతో ఈ రెండు కంపెనీలకు ఆరు, ఎనిమిదో స్థానాలు లభించాయి.
 
దేశంలో అత్యధిక మార్కెట్‌ క్యాప్‌ ఉన్న ఆసియా కుబేరుడు ముకేశ్‌ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు ఈ జాబితాలో 10వ స్థానం లభించింది. బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ 13వ, యెస్‌ బ్యాంక్‌ 14వ, ఐబీఎం 15వ, దాల్మియర్‌ ఏజీ 16వ, ఫ్రెష్‌వర్క్స్‌ 17వ, యాక్సెంచర్‌ 18వ, ఓలా 19వ, ఐసీఐసీఐ బ్యాంక్‌ 20వ, పీడబ్ల్యూసీ ఇండియా 21వ, కేపీఎంజీ ఇండియా 22వ, ఎల్‌ అండ్‌ టీ 23వ, ఒరాకిల్‌ 24వ, క్వాల్‌కామ్‌ 25వ స్థానాల్లో నిలిచాయి. 

ప్రతిభావంతులైన న్యూ మిలీనియల్స్‌ను ఆకర్షించేందుకు చేపట్టిన చర్యలతో బ్లూచిప్‌ కంపెనీలైన రిలయన్స్‌, ఎల్‌ అండ్‌ టీ వంటి దిగ్గజ కంపెనీలకు ఈ సంవత్సరం ఈ జాబితాలో చోటు లభించిందని భావిస్తున్నారు.
 
ఈ జాబితాలో చోటు సంపాదించిన కంపెనీల్లో ఎక్కువ భాగం ఇంజినీరింగ్‌ విభాగాల్లోనే ఎక్కువ నియామకాలు జరిపాయి. ఆపరేషన్స్‌, వ్యాపార అభివృద్ధి ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఫ్లిప్ కార్ట్, అమెజాన్, ఓయో తర్వాత వన్ 97, ఉబర్, స్విగ్గీ, టీసీఎస్, జొమాటో బెస్ట్ సంస్థలుగా నిలిచాయి.

లింక్డ్‌ఇన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 61 కోట్ల మంది సభ్యులు, ఆయా ప్రాంతాల సంస్థలను ఎంచుకున్నారు. కంపెనీపై ఆసక్తి, ఉద్యోగులతో ఆయా సంస్థల అనుబంధం, ఉద్యోగాలకు గిరాకీ, ఉద్యోగులను నిలుపుకోవడం.. వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సంస్థలను ఎంపిక చేశారు. 

ఈ జాబితాలోని సగం సంస్థలు ఈసారే చోటు దక్కించుకున్నాయని లింక్డ్‌ఇన్‌ ఇండియా మేనేజింగ్‌ ఎడిటర్‌ ఆదిత్‌ ఛార్లీ తెలిపారు. యువ నిపుణులను ఆకర్షించడం వల్లే ఎల్‌ అండ్‌ టీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌ వంటి దిగ్గజ సంస్థలు కూడా జాబితాలోకి చేరాయన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios