Asianet News TeluguAsianet News Telugu

ఈ విజయం కేరళ బాధితులకు అంకితం : కెప్టెన్ విరాట్ కోహ్లీ

ఆతిథ్య ఇంగ్లాండ్ తో ఇవాళ ముగిసిన మూడో టెస్ట్ లో టీం ఇండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయాన్ని వరదలతో అతలాకుతలం అయిన కేరళ రాష్ట్రానికి, వరద బాధితులకు అంకితం ఇస్తున్నట్లు భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ ప్రకటించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... "ఈ విజయాన్ని కేరళ బాధితులకు అంకితమిస్తున్నాం. ఇది ఇండియన్ క్రికెట్ టీం తరపున బాధితులకు అందిస్తున్న చిరు సాయం" అని పేర్కొన్నాడు.
 
Virat Kohli Dedicates Third test Win To Kerala Flood Victims
Author
Trentbridge, First Published Aug 22, 2018, 5:43 PM IST

ఆతిథ్య ఇంగ్లాండ్ తో ఇవాళ ముగిసిన మూడో టెస్ట్ లో టీం ఇండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయాన్ని వరదలతో అతలాకుతలం అయిన కేరళ రాష్ట్రానికి, వరద బాధితులకు అంకితం ఇస్తున్నట్లు భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ ప్రకటించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... "ఈ విజయాన్ని కేరళ బాధితులకు అంకితమిస్తున్నాం. ఇది ఇండియన్ క్రికెట్ టీం తరపున బాధితులకు అందిస్తున్న చిరు సాయం" అని పేర్కొన్నాడు.

ఇంగ్లాండ్ టూర్ లో భాగంగా ఐదు టెస్ట్ ల సీరిస్ లో ఇప్పటికే టీం ఇండియా రెండు మ్యాచుల్లో ఘోర పరాభవం పొందింది. దీంతో సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే మూడో టెస్ట్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ మ్యాచ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత జట్టు సమిష్టిగా రాణించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ట్రెంట్ బ్రిడ్జ్ టెస్ట్‌లో 203 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను మట్టికరిపించింది.  

ఈ మ్యాచ్ మొత్తంలో విరాట్ బ్యాటింగ్ హైలైట్. అతడు మొదటి ఇన్నింగ్స్ 97 పరుగులు సాధించి సెంచరీ మిస్ అయ్యాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం సెంచరీతొ (103 పరుగులు) కదం తొక్కాడు. దీంతో ఈ విజయంలో కీలక పాత్ర వహించిన కోహ్లీ మ్యాన్ ఆప్ ది మ్యాచ్ గా నిలిచాడు.  
 
 ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో సమిష్టిగా రాణించి విజయంలో అందరూ తలో చేయి వేశారని కోహ్లీ అన్నాడు. బ్యాట్స్ మెన్స్ బాగా రాణించి పరుగులు సాధించి, బౌలర్లు కూడా అదేరీతిలో ప్రత్యర్థి వికెట్లు పడగొడుతూ ఇంగ్లాండ్ పై ఒత్తిడి పెంచినట్లు తెలిపారు. తదుపరి మ్యాచుల్లో కూడా భారత బౌలర్లకు 20 వికెట్లు తీయడానికి సిద్దంగా ఉన్నారని కోహ్లీ తెలిపారు. 

ఈ టెస్ట్ లో భారత విజయంతో సీరిస్ మరింత రసవత్తరంగా మారింది. సౌతాంప్టన్ వేధికగా నాలుగో టెస్ట్ ఆగస్ట్ 30 నుండి ప్రారంభంకానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios