వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో భారత క్రీడాకారిణి వినేశ్ ఫోగట్ కాంస్య పతకాన్ని  సాధించింది. 53 కిలోల మహిళల విభాగంలో ఫోగట్ 4-1 తేడాతో గ్రీస్ రెజ్లర్  మారియా ప్రివోలరికీ ని చిత్తు చేసింది. దీంతో ఆమె ఖాతాలోకి తొలి వరల్డ్ ఛాంపియన్‌షిప్ మెడల్ చేరింది. ఈ విజయం ద్వారా ఫోగట్ మరో అరుదైన అవకాశాన్ని పొందింది. జపాన్ రాజధాని టోక్యో వేదికన జరగనున్న ఒలింపిక్స్ 2020 కి ఫోగట్ అర్హత సాధించింది. 

ఈ టోర్నీ ఆరంభం నుండి ఫోగట్ అద్భుత విజయాలను సాధిస్తూ ఈ క్వార్టర్ ఫైనల్ కు చేరింది. ఫ్రీక్వార్టర్ పైనల్లో అమెరికాకు చెందిన సరా అన్‌ హిల్డర్‌ బ్రాండ్ట్‌ ను అతి సునాయసంగా 8-2 తేడాతో విజయం సాధించి ఫోగట్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. 

మంగళవారం జరిగిన 53 కేజీల ప్రిక్వార్టర్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ మయు ముకయిద చేతిలో 7–0తో వినేశ్‌ను ఓడిపోయింది. దీంతో టైటిల్‌ రేస్‌ నుంచి నిష్క్రమించినా తాజా విజయంతో కాంస్యాన్ని సాధించింది.