టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీది ప్రేమ వివాహమని అందరికి తెలిసిందే. వీరిద్దరూ ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలుసుకున్నారనే దానిపై ఇటీవల వచ్చిన ధోనీ బయోపిక్ ‘‘ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ‘‘ ద్వారా కొన్ని వివరాలు తెలిశాయి.

అయితే అసలు వీరిద్దరిని కలిపింది ఎవరనేది మాత్రం బయటకు తెలియదు. ఈ ఉత్కంఠకు తెరదించారు ధోనీ భార్య సాక్షి. సోమవారం ముంబైలో తన 30వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు సాక్షి.. దీనికి క్రికెటర్ల, సినీతారలు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో హార్డిక్ పాండ్, రాబిన్ ఊతప్ప కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు సాక్షి.

ఈ సందర్భంగా రాబిన్ ఊతప్పతో దిగిన ఫోటోకి ‘‘ ధోనిని, నన్ను కలిపిన ఈ వ్యక్తికి కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేసింది. అన్నట్లు ఈ పుట్టినరోజు వేడుకలో పాండ్య, సింగర్ రాహుల్ వైద్యతో కలిసి పాటలు పాడారు సాక్షి. 2010లో ధోనీ, సాక్షి వివాహం చేసుకున్నారు.. వీరికి జీవా అనే కూతురు ఉంది.

ధోనీ ఔట్: ఆస్ట్రేలియాతో తలపడే భారత జట్టు ఇదే..

ధోనీ 20ఏళ్ల కుర్రాడు అనుకున్నారా.. కపిల్ దేవ్ కామెంట్స్

ఏపీలో ధోనీ క్రికెట్ అకాడమీ.. ప్రభుత్వంతో ఒప్పందం

ధోనీతో సరితూగే కీపర్....ఈ పదేళ్లలో అతడే నెంబర్‌వన్: గంగూలి

''ధోనీ దరిదాపుల్లోకి కూడా వారు రాలేరు...వారి కోసం తప్పించారా?''

రిషబ్ పంత్ కోసమే.. ధోనీ అలా చేశాడు.. కోహ్లీ

కేరళ అభిమానులకు ధోనీ ఫీవర్....ఐదో వన్డే సందర్భంగా భారీ కటౌట్ (వీడియో)

2019 ప్రపంచకప్‌లో .. కోహ్లీ పక్కన ధోనీ ఉంటేనే: సునీల్ గావస్కర్

ధోనీ, కోహ్లీ, రోహిత్‌లను నిలబెట్టిన ‘‘విశాఖ’’

రాజకీయాల్లోకి ధోనీ, గంభీర్..?