అన్ని రంగాల్లో ఉన్నట్లే క్రికెట్‌లో కూడా కొన్ని నమ్మకాలు, సెంటిమెంట్లు ఉంటాయి.. కొందరు వాటిని నమ్మకున్నా అవి వెంటాడుతూనే ఉంటాయి. వన్డేల్లో ఏ జట్టయినా 321 పరుగులు చేస్తే ఇక గెలిచనట్లేనని గుండెల మీద చెయ్యి వేసుకుని ధీమాగా ఉంటుంది.

అలాంటిది అంత స్కోరు చేసినా ఓడిపోతుంటే.. ఇలా ఒకసారి కాదు.. ఏకంగా మూడుసార్లు అదే స్కోరు వద్ద... ఒక జట్టు ఓటమిని చవిచూస్తోంది. అదే మరే జట్టో కాదు.. టీమిండియా. అవును భారత్‌కు 321 పరుగులు కలిసిరావడం లేదు. గతంలో ఇదే స్కోరును రెండు సార్లు చేసి ఓటమి పాలైంది.

2007లో పాకిస్తాన్‌తో ఛండీగడ్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ .. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (99) ఇన్నింగ్స్‌తో ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన పాకిస్తాన్‌ను యూనిస్ ఖాన్ (117) అద్భుత శతకంతో జట్టును మరో బంతి మిగిలివుండగానే గెలిపించాడు.

2017లో ఓవల్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా శిఖర్ ధావన్ 125, రోహిత్ శర్మ 78, ధోనీ 63 మెరుపులతో 321 పరుగులు చేసింది.. ఈ టార్గెట్‌ను ఛేదించడానికి బరిలోకి దిగిన శ్రీలంక 48.4 ఓవర్లలోనే పని పూర్తి చేయడంతో భారత్ ఓటమి పాలైంది.

తాజాగా విశాఖలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ 157, అంబటి రాయుడు 73 పరుగుల మెరుపు ఇన్నింగ్సుతో 50 ఓవర్లలో 321 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన విండీస్‌‌ను షైహోప్ విరోచిత బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను టై చేశాడు..

వెస్టిండీస్ గెలవకపోయినా దాదాపు గెలిచినట్లే. ఇలా ఒకే స్కోరు వద్ద భారత్ ఓడిపోవడం యాదృచ్చికమే అయినా.. భారీ స్కోరు సాధించినా గెలవకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.

విశాఖ పిచ్‌పై పూజలు... చీఫ్ సెలెక్టర్‌ ఎమ్మెస్కేపై విమర్శలు

వైజాగ్ వన్డేలో సచిన్ రికార్డును బద్దలుగొట్టిన కోహ్లీ

విశాఖ వన్డే టై: హోప్ అద్భుతమైన బ్యాటింగ్

ధోనీ, కోహ్లీ, రోహిత్‌లను నిలబెట్టిన ‘‘విశాఖ’’

ధోనీ లా ఒకరోజు గడపాలని ఉంది.. పాక్ మహిళా క్రికెటర్ సనామీర్

రోహిత్ మరో సిక్స్ కొడితే సచిన్ రికార్డు బద్దలు....

''వీల్‌చైర్లో ఉన్నా ధోనిని బరిలోకి దించుతా''