మహేంద్ర సింగ్ ధోని... భారత దేశంలో క్రికెట్ అభిమానులకు సుపరిచితమైన పేరు. అతడి స్వరాష్ట్రం జార్ఖండ్ అయినా దేశవ్యాప్తంగా అతడికి అభిమానులున్నారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అతడికున్న క్రేజు అంతాఇంతా కాదు. ఐపీఎల్ లో ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాద్యతలు చేపట్టినప్పటి నుండి తమిళ తంబీలు అతడిపై అభిమానాన్ని మరింత పెంచుకున్నారు. కేవలం తమిళులే కాదు దక్షిణ భారతంలోని ప్రతి క్రికెట్ అభిమాని ధోనీ ధనా ధనా బ్యాటింగ్ కూ అభిమానులే.

తమిళనాడు మాదిరిగానే కేరళలో కూడా ధోనీకి మంచి ఫాలోయింగ్ ఉంది. భారత్-వెస్టిండిస్ ల మధ్య జరుగుతున్న వన్డే సీరిస్‌లో చివరి మ్యాచ్  గురువారం కేరళలోని  తిరువనంతపురంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం టీంఇండియా జట్టుతో కలిసి ధోనీ కూడా కేరళకు చేరుకున్నారు. అయితే ధోనీ పై వున్న అభిమానాన్ని కొందరు అభిమానులు వినూత్నంగా చాటుకోవాలనుకున్నారు.   

ఇకేముంది  సినిమా స్టైల్ ను ఫాలో అయ్యారు. తమ అభిమాన నటుల సినిమా విడుదల సందర్భంగా భారీ కటౌట్లు ఏర్పాటుచేసినట్లే ఆల్ కేరళ ధోనీ ఫ్యాన్స్ అసోసియేషన్ త్రివేండ్రంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం వద్ద ధోనీ భారీ కటౌట్ ఏర్పాటుచేశారు. ఈ కటౌట్ ఏర్పాటుకు సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. తలైవా(ధోనీ) విశ్వరూపం తయారవుతోందన్న క్యాప్షన్ తో పోస్ట్ చేశారు. 

వీడియో