ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరగనున్న మొట్టమొదటి టీ20 మ్యాచ్ కోసం బిసిసిఐ భారత జట్టును ప్రకటించింది. ఇప్పటికే టీ20 సీరిస్ నుండి మహేంద్ర సింగ్ ధోనిని తప్పించిన సెలెక్టర్లు ఆ స్థానంలో యువ ఆటగాడు రిషబ్ పంత్ ను ఎంపిక చేశారు. 12 మంది ఆటగాళ్లతో కూడిన బృందాన్ని ఇవాళ బిసిసిఐ అధికారిక ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. 

ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు ఈ సీరిస్ కోసం  ఆస్ట్రేలియాకు చేరుకున్నారు.  మూడు టీ20 మ్యాచుల సిరీస్ లో మొదటి మ్యాచ్ రేపు(బుధవారం) బ్రిస్బోన్‌లోని గబ్బా స్టేడియంలో జరగనుంది. 

స్వదేశంలో వెస్టిండిస్ తో జరిగిన టీ20 సీరిస్ నుండి విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ మళ్లీ కెప్టెన్ పగ్గాలు అందుకున్నారు. దీంతో రోహిత్ శర్మ రోహిత్ శర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవరించనున్నాడు. ఇక ఈ సీరిస్ కు ధోనీని ఎంపిక చేయకపోకపోవడంతో అతడి స్థానంలో ఎవరికి అవకాశం కల్పిస్తారా అన్న ఉత్కంట అభిమానుల్లో నెలకొంది. గతంలో కోహ్లీ తో పాటు పలువురు ఆటగాళ్లు చెప్పినట్లుగానే ధోనీ స్థానంలో రిషబ్ పంథ్‌ ఎంపికయ్యాడు. స్పెషలిస్ట్ బ్యాట్ మెన్ గానే కాకుండా వికెట్ కీపర్‌గా కూడా రిషబ్ కు అవకాశం వచ్చింది. 

బిసిసిఐ ప్రకటించిన ఆటగాళ్ల లిస్ట్:
  
1. విరాట్ కోహ్లీ(కెప్టెన్)
2. రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్)
3. శిఖర్ ధావన్
4. కే.ఎల్. రాహుల్
5. రిషబ్ పంత్ (వికెట్ కీపర్)
6. దినేష్ కార్తిక్
7. కృనాల్ పాండ్యా
8. కుల్‌దీప్ యాదవ్
9. భువనేశ్వర్ కుమార్
10. జస్ప్రిత్ సింగ్ బుమ్రా
11. ఖలీల్ అహ్మద్
12. యుజువేంద్ర చాహల్