టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గ్రౌండ్‌లో సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లపై విరుచుకుపడతుంటాడు. అతని హిట్టింగ్ ధాటికి స్కోరుబోర్డు పరుగులు పెట్టాల్సిందే. అలాగే అతను మంచి ఎంటర్‌టైనర్ కూడా.. గ్రౌండ్‌లో ఫీల్డింగ్ చేస్తూ , బ్యాటింగ్ చేస్తూ సరదాగా గడుపుతుంటాడు.

ఇలాంటి వ్యక్తి డ్యాన్స్‌లో ఓడిపోయాడు. టీమిండియా మరో ఓపెనర్ శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు మైదానంతో పాటు బయట కూడా ఎంతో సన్నిహితంగా మెలుగుతారు. ఇరువురు కుటుంబాలు అప్పుడప్పుడు కలుస్తాయి కూడా. ఈ క్రమంలో ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ధావన్ కుటుంబంతో రోహిత్ సరదాగా గడిపాడు.

దీనిలో ధావన్ కుమార్తె రియా.. రోహిత్‌కు డ్యాన్స్ టీచర్‌గా మారింది. ఫ్లాస్ డ్యాన్స ఎలా చేయాలో నేర్పించింది. పిడికిలి బిగించి, వేగంగా చేతులు తిప్పడం ఈ డ్యాన్స్ స్టైల్. అయితే ఆ స్టెప్పులు నేర్చుకోవడానికి రోహిత్ ఎంత ప్రయత్నించినా అతను విఫలమయ్యాడు.

వాటిని చేయలేక చేతులెత్తేశాడు. పక్కనే ఉన్న ధావన్ భార్య, కొడుకు వీరిని ఆసక్తిగా గమనించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్వీట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. మరోవైపు నిన్న సిడ్నీలో జరిగిన వన్డేలో భారత్ 34 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ ఒంటరిపోరు చేసి సెంచరీ సాధించినా టీమిండియాను గట్టెక్కించలేకపోయాడు.

అదే కొంప ముంచింది: ఓటమిపై కోహ్లీ రియాక్షన్

రిచర్డ్స్ రికార్డును బ్రేక్ చేసిన రోహిత్ శర్మ

సచిన్ తర్వాత ఆస్థానం.. రోహిత్ శర్మదే..

సిడ్నీ వన్డే: రోహిత్ సెంచరీ వృధా...34 పరుగుల తేడాతో భారత్ ఓటమి

ధోనీ స్లాట్: కోహ్లీని కాదన్న రోహిత్ శర్మ

అనుచిత వ్యాఖ్యలు: హార్డిక్ పాండ్యాకు మరో దెబ్బ

హార్దిక్ పాండ్యా ఎవరు..? ఈషా గుప్త ఫైర్

వారిద్దరూ ఉంటే నా భార్యాకూతుళ్లతో... భజ్జీ సంచలన వ్యాఖ్యలు

‘‘యూఏఈకి జై కొట్టండి’’... భారత అభిమానులను బంధించిన దుబాయ్ షేక్

ద్రవిడ్ యువతిని ఎలా కన్విన్స్ చేశాడో చూడు...పాండ్యాపై నెటిజన్ల క్లాస్