MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • బిగ్ షాక్.. టీ20 వరల్డ్ కప్ 2026 తర్వాత సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్?

బిగ్ షాక్.. టీ20 వరల్డ్ కప్ 2026 తర్వాత సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్?

Suryakumar Yadav : టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ చేరిన భారత్.. న్యూజిలాండ్ తో అమీతుమీకి సిద్ధమైంది. అయితే, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్ వార్తలతో మరో హాట్ టాపిక్ నడుస్తోంది. సూర్య నిజంగానే రిటైర్ తీసుకోబోతున్నారా?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 07 2026, 05:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫైనల్‌కు భారత్.. కెప్టెన్ సూర్య సారధ్యంలో అద్భుత ప్రయాణం
Image Credit : ANI

ఫైనల్‌కు భారత్.. కెప్టెన్ సూర్య సారధ్యంలో అద్భుత ప్రయాణం

టీ20 వరల్డ్ కప్ 2026లో భారత క్రికెట్ జట్టు అద్భుత విజయాలతో దూసుకుపోతోంది. సూర్యకుమార్ యాదవ్ సారధ్యంలో టీమ్ ఇండియా అద్భుత ప్రదర్శన చేస్తూ ఫైనల్‌లో అడుగుపెట్టింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరగనున్న తుది పోరులో భారత్ తలపడనుంది. ఈ టోర్నీ చరిత్రలో మూడోసారి ఛాంపియన్‌గా నిలవడానికి టీమ్ ఇండియా కేవలం అడుగు దూరంలో ఉంది. సూర్య కెప్టెన్‌గా జట్టును సమర్థంగా నడిపిస్తున్న తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఫీల్డింగ్ సెటప్, బౌలింగ్ మార్పులలో అతను తన చాకచక్యాన్ని ప్రదర్శించి జట్టును ఫైనల్ చేర్చాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బ్యాటింగ్‌లో వైఫల్యం.. ఆందోళనలో అభిమానులు
Image Credit : Getty

బ్యాటింగ్‌లో వైఫల్యం.. ఆందోళనలో అభిమానులు

జట్టు విజయపథంలో ఉన్నప్పటికీ, బ్యాటర్‌గా సూర్యకుమార్ యాదవ్ ఈ టోర్నీలో ఆశించిన స్థాయిలో రాణించలేక ఘోరంగా విఫలమవుతున్నారు. టోర్నీ ప్రారంభంలో అమెరికాపై 84* పరుగులతో మెరుపులు మెరిపించిన స్కై, ఆ తర్వాత ఆ స్థాయి ఆటను కొనసాగించలేకపోయారు. గత ఏడు మ్యాచుల్లో ఆయన కనీసం 40 పరుగుల మార్కును కూడా దాటలేకపోవడం గమనార్హం. ఎనిమిది మ్యాచుల్లో 34.37 సగటుతో 242 పరుగులు మాత్రమే చేసిన సూర్య, తన ట్రేడ్‌మార్క్ దూకుడును కోల్పోయినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా సెమీఫైనల్ వంటి కీలక మ్యాచుల్లోనూ తక్కువ స్కోరుకే పరిమితమవ్వడం విమర్శలకు తావిస్తోంది.

35
గత ఏడాది సూర్య ఫామ్.. 2026 లెక్కలు ఇవే
Image Credit : ANI

గత ఏడాది సూర్య ఫామ్.. 2026 లెక్కలు ఇవే

సూర్యకుమార్ యాదవ్ ఫామ్ గత కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతోంది. 2025లో ఆయన అత్యంత దారుణమైన ఫామ్‌ను ఎదుర్కొన్నారు. ఆ ఏడాది 21 మ్యాచుల్లో కేవలం 218 పరుగులు మాత్రమే చేసి, 13.62 సగటుతో నిరాశపరిచారు. అయితే, 2026 ప్రారంభంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో అద్భుతంగా పుంజుకున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 13 మ్యాచుల్లో 48.40 సగటుతో 484 పరుగులు సాధించారు. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. కానీ, ఐసీసీ మెగా టోర్నీ టీ20 వరల్డ్ కప్‌లో నిలకడ లేకపోవడం గమనార్హం.

45
సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్ వార్తలు: నిజమెంత?
Image Credit : ANI

సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్ వార్తలు: నిజమెంత?

ప్రస్తుతం 35 ఏళ్ల వయసులో ఉన్న సూర్యకుమార్ కేవలం టీ20 ఫార్మాట్‌కే పరిమితమయ్యారు. టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉండటమే కాకుండా, వన్డే జట్టులోకి ఆయన తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. కేవలం ఒకే ఫార్మాట్ ఆడుతూ, అందులోనూ ఫామ్ కోల్పోతే కెరీర్ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే వరల్డ్ కప్ తర్వాత ఆయన రిటైర్మెంట్ ప్రకటించవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. శ్రేయాస్ అయ్యర్ వంటి యువ ఆటగాళ్లు జట్టులోకి రావడానికి సిద్ధంగా ఉండటం సూర్యపై ఒత్తిడి పెంచుతోంది. అందుకే కొన్ని రిపోర్టులు సూర్య రిటైర్మెంట్ ను విషయాలను ప్రస్తావిస్తున్నాయి. కానీ, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

55
బీసీసీఐ వ్యూహం: కెప్టెన్సీ ఒక్కటే సరిపోదా?
Image Credit : Getty

బీసీసీఐ వ్యూహం: కెప్టెన్సీ ఒక్కటే సరిపోదా?

2024 జూలై నుంచి టీ20 కెప్టెన్‌గా సూర్య రికార్డు అద్భుతంగా ఉంది. ఆయన నాయకత్వంలో భారత్ ఒక్క టీ20 సిరీస్‌ను కూడా కోల్పోలేదు. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గతంలో తీసుకున్న నిర్ణయాలను గమనిస్తే, కేవలం కెప్టెన్సీ ఆధారంగా ఎవరినీ జట్టులో కొనసాగనివ్వదు. ఆటగాడిగా రాణించడం తప్పనిసరి. వరల్డ్ కప్ ముగిసిన వెంటనే సెలెక్టర్లు సూర్య ప్రదర్శనపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఒకవేళ భారత్ వరల్డ్ కప్ గెలిస్తే, ఒక విజేతగా సూర్య తన వీడ్కోలును ప్రకటించే అవకాశం ఉందని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో మరికొందరు సూర్య మరికొన్నేండ్లు ఆడతారని చెబుతున్నారు. మరి ఈ వార్తల పై సూర్య ఏం చెబుతున్నారో చూడాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image3
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Related Stories
Recommended image1
T20 World Cup 2026 Final : భారత్ vs కివీస్.. హెడ్ టు హెడ్ రికార్డుల్లో ఎవరిది పైచేయి?
Recommended image2
T20 World Cup ఫైనల్‌లో అభిషేక్ శర్మను ఆడిస్తారా? గంభీర్, సూర్యల ప్లానేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved