ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో టీం ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరో ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాపై అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన రెండో క్రికెటర్ గా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ రోజు జరిగిన వన్డే మ్యాచ్ లో రోహిత్ సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. ఈ సెంచరీ ఆసీస్ పై వన్డేల్లో రోహిత్ కి 7వది కాగా.. ఓవరాల్ గా 22వ సెంచరీ.

ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా సచిన్ టెండుల్కర్ రికార్డ్ నెలకొలపగా.. అతని తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ నిలిచాడు. ఆస్ట్రేలియాపై సచిన్..9వన్డే సెంచరీలు సాధించాడు. 

శనివారం సిడ్నీలో జరిగిన వన్డే మ్యాచ్ లో రోహిత్..110 బాల్స్ కి సెంచరీ చేశాడు.  నాలుగు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీం ఇండియాను రోహిత్ సెంచరీతో ఆదుకునే ప్రయత్నం చేశాడు. రోహిత్ తన శాయశక్తులా కృషి చేసినప్పటికీ.. టీంఇండియా గెలవలేకపోయింది. దీంతో.. రోహిత్ సెంచరీ కాస్త వృథా అయ్యింది.