Asianet News TeluguAsianet News Telugu

సిడ్నీ వన్డే: రోహిత్ సెంచరీ వృధా...34 పరుగుల తేడాతో భారత్ ఓటమి

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఆటగాడు ఎంఎస్ ధోనీ అర్థసెంచరీ సాధించాడు.

india vs australia 1st ODI at sydney : live updetes
Author
Sydney NSW, First Published Jan 12, 2019, 7:40 AM IST

సిడ్నీలో భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మొదటి వన్డేలో భారత్ ఓటమిపాలయ్యింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసిస్ 288 పరుగులు చేసి భారత్  ముందు భారీ విజయ లక్ష్యాన్ని వుంచింది. అయితే చేధనలో భాగంగా బ్యాటింగ్ కు దిగిన టీంఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేవలం నాలుగు పరుగులకే ముఖ్యమైన మూడు వికెట్లు కోల్పోయింది. 

ఈ సమయంలో ఓపెనర్ రోహిత్, ధోనిలు మ్యాచ్ ను చక్కదిద్దారు. ఆచి తూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. ఈ సమయంలో అర్థశతకాన్ని పూర్తి చేసిన వెంటనే ధోని ఔటయ్యాడు. ఆ తర్వాత రోహిత్ సెంచరీతో కదంతొక్కి ఒంటరిపోరాటం చేస్తూ  విజయంపై ఆశలు రేకెతత్తించాడు. కానీ చివరకు అతడు కూడా  221 పరుగుల వద్ద పెవిలియన్ బాట పట్టడంతో భారత్ ఓటమి ఖాయమయ్యింది.

చివరి ఓవర్లలో భువనేశ్వర్ వేగంగా ఆడుతూ కొన్ని మెరుపులు మెరిపించినా భారత్ కు విజయాన్ని అందించలేకపోయాడు. నిర్ణీత 50  ఓవర్లలో భారత్ 254 పరుగులు చేయగల్గింది. దీంతో 34 పరుగుల తేడాతో ఆసిస్ విజయం సాధించింది.

సిడ్నీ వన్డేలో భారత్ ఓటమి దాదాపు ఖరారయ్యిది. భారత్ ఆటగాడు కుల్దీప్ యాదవ్ ఏడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం  భారత్ స్కోరు 254 పరుగులుగా వుంది. 

సిడ్నీ వన్డేలో ఓపెనర్ రోహిత్  ఒంటరి పోరాటం ముగిసింది. భారీ లక్ష్యచేధనతో బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే టప టప వికెట్లు కోల్పోయినా సమయోచిత ఇన్సింగ్స్ ఆడిన రోహిత్ సెంచరీ సాధించాడు. అయితే సెంచరీ తర్వాత వేగాన్ని పెంచిన రోహిత్ 133 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టోయిన్స్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. 

ఓ వైపు రోహిత్ విరోచిత సెంచరీతో పోరాడుతున్న అతడికి సహకారం అందిస్తూ కేవలం క్రీజులో నిలిచే బ్యాట్ మెన్ కరువయ్యారు. రోహిత్ సెంచరీ తర్వాత రెచ్చిపోయి ఆడుతుంటే...మరో వైపు మిగతా ఆటగాళ్లు పెవిలియన్ బాట పడుతూనే వున్నారు. దినేశ్ కార్తిక్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా కేవలం 8 పరుగులే చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం రోహిత్ 128 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. మొత్తానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. 

భారత్ బ్యాట్ మెన్స్ అందరూ చేతులెత్తేసిన సమయంలో సిడ్నీ వన్డేలో భారత జట్టును ఓపెనర్ రోహిత్ శర్మ ఆదుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా ఒత్తిడికి లోనవకుండా రోహిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించాడు. 113 బంతుల్లోనే వంద పరుగులను పూర్తి చేసి నాటౌట్ గా నిలిచి భారత్ ను విజయం వైపు నడిపిస్తున్నాడు. ప్రస్తుతం భారత్ 5 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది.  

సిడ్నీ టెస్టులో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. భారీ లక్ష్యచేధనలో ఓపెనర్ రోహిత్ సెంచరీకి చేరువైన సమయంలో భారత అభిమానులు సంబరాలను సిద్దమవుతుండగా దినేశ్ వికెట్ కోల్పోవడం నిరాశపర్చింది. 

బ్యాటింగ్ సాఫీగా సాగుతూ భారత జట్టు భారీ విజయలక్ష్యం వైపు వడివడిగా అడుగులేస్తున్న సమయంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. వెంటవెంటనే వికెట్లు పడుతున్న సమయంలో రోహిత్ కు తోడుగా మంచి బ్యాటింగ్ ప్రదర్శనతో అర్థశతకం సాధించిన ధోని ఔటయ్యాడు. దీంతో భారత్ 141 పరుగుల వద్ద నాలుగో వికెట్ కొల్పోయింది.   

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఆటగాడు ఎంఎస్ ధోనీ అర్థసెంచరీ సాధించాడు. ఆసీస్ నిర్దేశించిన 289 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.

తొలి రెండు ఓవర్లలోనే ఓపెనర్ శిఖర్ ధావన్, కెప్టెన్ విరాట్ కోహ్లీ అంబటి రాయుడు పెవిలియన్ చేరారు. 4 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో రోహిత్ శర్మ, ధోనీ జంట ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ఆచి తూచి ఆడుతూనే ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు.

ముఖ్యంగా రోహిత్ శర్మ సిక్సర్లు, ఫోర్లతో వీరవిహారం చేశాడు. ఈ క్రమంలో వన్డేల్లో 38వ అర్థసెంచరీని సాధించాడు. అనంతరం ధోనీ కూడా అర్థ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం భారత్ ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 73, ధోనీ 51 పరుగులతో క్రీజులో ఉన్నారు.

అంతకు ముందు టాస్ గెలిచిన ఆసీస్ సారథి ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ ప్రారంభించిన ఆ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో కెప్టెన్ ఫించ్ ఔటయ్యాడు. అనంతరం ఉస్మాన్ ఖవాజాతో కలిసి అలెక్స్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు.

ఈ క్రమంలో క్రీజులో నిలదొక్కుకుంటున్న అలెక్స్‌ను కుల్‌దీప్ పెవిలియన్‌కు పంపాడు. 41 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయిన ఆసీస్‌ను ఖవాజా, షాన్ మార్ష్ జోడీ ఆదుకుంది. ఆచితూచి ఆడుతూనే అప్పుడప్పుడు బౌండరీలు బాదుతూ ఈ జోడీ స్కోరుబోర్డును పరుగులు పెట్టించింది.

ఈ క్రమంలో ఖవాజా అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం 59 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఖవాజా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత హ్యాండ్స్‌కోంబ్‌తో కలిసి షాన్ మార్ష్ స్కోరుబోర్డును నడిపించాడు. ఈ క్రమంలో మార్ష్ వన్డేల్లో 13వ అర్థసెంచరీ నమోదు చేసుకున్నాడు.

వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 53 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని కుల్‌దీప్ వీడదీశాడు. అనంతరం పీటర్ హ్యాండ్స్‌కోంబ్, మార్కస్ స్టోనీన్ల జోడీ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ముఖ్యంగా ఇద్దరు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడటంతో ఆసీస్ స్కోరు బోర్డు దూసుకెళ్లింది.

ఈ దశలో అర్థసెంచరీ పూర్తి చేసుకున్న కాంబ్ ఆ తర్వాత మరింత చెలరేగిపోయాడు. ప్రమాదకరంగా మారుతున్న హ్యాండ్స్‌కాంబ్‌ను భువనేశ్వర్ కుమార్ ఇంటికి పంపాడు. ఆ తర్వాత మాక్స్‌వెల్ జతగా స్టోనీన్ మెరుపులు మెరిపించడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 288 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. స్టోనీన్ 47, మాక్స్‌వెల్ 11 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

Follow Us:
Download App:
  • android
  • ios