రవిదహియా బాల విద్యాలయ... ఒలింపిక్ విన్నింగ్ రెజ్లర్ పేరు మీద స్కూల్...
ఢిల్లీలోని ఆదర్శ్‌నగర్‌లో గల స్కూల్‌కి ‘రవి దహియా బాల విద్యాలయ’గా నామకరణం... స్కూల్‌లో రవిదహియా భారీ విగ్రహం కూడా పెడతాం... - ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రకటన
టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన భారత రెజ్లర్ రవికుమార్ దహియాకి అరుదైన గౌరవం దక్కింది. దేశరాజధాని ఢిల్లీలోని ఓ ప్రభుత్వ స్కూల్‌కి రవికుమార్ దహియా బాల విద్యాలయగా నామకరణం చేసింది అక్కడి ప్రభుత్వం...
ఢిల్లీలోని ఆదర్శ్‌నగర్‌లో గల స్కూల్‌కి ‘రవి దహియా బాల విద్యాలయ’గా నామకరణం చేస్తున్నట్టు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రకటించారు. ‘ఈ స్కూల్‌లో రవిదహియా భారీ విగ్రహం కూడా పెడతాం. పిల్లలకు ఇది స్ఫూర్తిదాయకంగా, ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. ఒలింపిక్‌లో భారత్‌కి పతకం తేవాలని ఆలోచనను, ఆశయాన్ని వారిలో రేకెత్తిస్తుంది...’ అంటూ తెలిపారు మనీష్ సిసోడియా.
ఒలింపిక్ కోసం కఠినంగా శ్రమించానని, తన ప్రయాణంలో అడుగడుగునా ఢిల్లీ ప్రభుత్వం తనకి అండగా నిలిచి, సహాయం చేసిందని రవికుమార్ దహియా కామెంట్ చేశారు...
టోక్యో ఒలింపిక్స్ 57 కేజీల ఫ్రీ స్టైయిల్ రెజ్లింగ్ విభాగంలో ఫైనల్ చేరిన రవికుమార్ దహియా, రష్యాకి చెందిన రెజ్లర్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-7 తేడాతో ఓడిన విషయం తెలిసిందే. సుశీల్ కుమార్ తర్వాత ఒలింపిక్స్‌తో రజతం గెలిసిన భారత రెజ్లర్‌గా నిలిచిన రవికుమార్ దహియా... ఈ విజయం తనకి ఏ మాత్రం సంతృప్తినివ్వలేదని, స్వర్ణం గెలవడమే తన ప్రధాన లక్ష్యమంటూ తెలిపాడు.