కెన్యాకు చెందిన ప్రముఖ అథ్లెట్ నికోలస్ బెట్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. నైజీరియాలో జరిగిన ఆఫ్రికా హర్డల్స్ ఛాంపియన్  షిప్‌లో పాల్గొని ఇంటికి వెళ్తుండగా నాంది కౌంటీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బెట్ ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బెట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

రికార్డుల రారాజు:
కెన్యా హర్డల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన నికోలస్ బెట్ దేశానికి ఎన్నో పతకాలు సాధించిపెట్టారు.. 2015లో జరిగిన 400 మీటర్ల పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు. చైనాలో జరిగిన షార్ట్ డిస్టెన్స్ హర్డల్స్ రేస్ పోటీల్లో విజేతగా నిలిచి.. చైనా గడ్డపై ఆ ఘనత సాధించిన తొలి కెన్యా క్రీడాకారుడిగా రికార్డుల్లోకి ఎక్కారు. రెండు సార్లు ఆఫ్రికా హర్డల్స్ ఛాంపియన్‌షిప్‌ సొంతం చేసుకున్నారు. ఇంత ఘనమైన ట్రాక్ రికార్డ్ ఉన్న బెట్ 2016లో బ్రెజిల్‌ జరిగిన రియో ఒలింపిక్స్‌కు బెట్ అర్హత సాధించలేదు.