Asianet News TeluguAsianet News Telugu

తల్లిదండ్రుల చిరు కోరిక నెరవేర్చిన నీరజ్ చోప్రా... తొలిసారిగా ఒలింపిక్ విన్నర్ పేరెంట్స్...

తల్లిదండ్రులతో కలిసి విమాన ప్రయాణం చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన నీరజ్ చోప్రా... తన చిన్న కల ఇన్నాళ్లకు నెరవేరిందంటూ కామెంట్...

Neeraj chopra parents take their first flight, javelin thrower express his feelings in social media
Author
India, First Published Sep 11, 2021, 12:37 PM IST

బిడ్డల కోసం తమ చిన్నచిన్న కోరికలను పక్కనబెట్టేస్తుంటారు తల్లిదండ్రులు. అదే పిల్లలు పెద్దయ్యాక, ప్రయోజకులై... తమ కోరికలను నెరవేరిస్తే... ఆ పేరెంట్స్ ఆనందానికి హద్దులు ఉండవేమో. ఇప్పుడు అలాంటి పుత్రోత్సాహాన్నే అనుభవిస్తున్నారు ఒలింపిక్ విన్నర్ నీరజ్ చోప్రా పేరెంట్స్...

టోక్యో ఒలింపిక్స్ 2020లో జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించి, భారత త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించిన నీరజ్ చోప్రా... స్వదేశం చేరిన తర్వాత వరుసగా సభలు, సమావేశాలు, టీవీ ఇంటర్వ్యూలతో బిజీబిజీగా గడిపేశాడు. ఎట్టకేలకు కాసింత విశ్రాంతి సమయం దొరకడంతో తల్లిదండ్రులను తీసుకుని, విహార యాత్రకు బయలుదేరాడు.

నీరజ్ చోప్రా తండ్రి సతీశ్ కుమార్ ఓ సాధారణ రైతు. తల్లి సరోజ్ దేవి, గృహిణి. వీరికి నీరజ్ చోప్రాతో పాటు  ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. సతీశ్ కుమార్‌కి చిన్నప్పటి నుంచి విమానం ఎక్కాలనే కోరిక ఉండేది. అయితే కుటుంబపోషణ, ఆర్థిక సమస్యల కారణంగా, అది కలగానే మిగిలిపోయింది...

ఇదీ చదవండి: ఎమ్మెస్ ధోనీకి ఊహించని షాక్... ఆ యాడ్స్ చేసినందుకు 15 రోజుల్లో నష్టపరిహారం చెల్లించాలంటూ...

నీరజ్ చోప్రా, తన తండ్రి కోరికను నిజం చేశాడు. తల్లిదండ్రులతో కలిసి విమాన ప్రయాణం చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన నీరజ్ చోప్రా... ‘నా చిన్న కల ఇన్నాళ్లకు నెరవేరింది. మా అమ్మానాన్న మొదటిసారి విమానం ఎక్కారు...’ అంటూ మురిసిపోతూ, తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. 

టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా, 121 ఏళ్ల భారత ఒలింపిక్ చరిత్రలో ఫీల్డ్ అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మొట్టమొదటి భారత అథ్లెట్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.

Follow Us:
Download App:
  • android
  • ios