ఎమ్మెస్ ధోనీకి ఊహించని షాక్... ఆ యాడ్స్ చేసినందుకు 15 రోజుల్లో నష్టపరిహారం చెల్లించాలంటూ...
ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2 ఆరంభానికి ముందు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఊహించని షాక్ తగిలింది. ఐదేళ్ల క్రితం ధోనీ చేసిన ఓ యాడ్‌కి 15 రోజుల్లో నష్టపరిహారం చెల్లించాలంటూ సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది...
ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న మహేంద్ర సింగ్ ధోనీ, బ్రాండ్ అంబాసిడర్‌గా వందల కోట్లు ఆర్జిస్తున్నాడు...
2009 నుంచి 2016 వరకూ ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ గ్రూప్‌కి కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు ఎమ్మెస్ ధోనీ...
వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ మాహీ యాడ్స్‌ను చూసి, ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలో సుమారు 1800 మంది ఫ్లాట్స్ కొనుగోలు చేశాడు...
అయితే బోర్డు తిప్పేసిన ఆ కంపెనీ, భూములు కొనుగోలు చేసిన వారికి ఫ్లాట్స్ కేటాయించడంలో విఫలమైంది. దీంతో బాధితులు, న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు...
కేసు విచారణ చేసిన సుప్రీంకోర్టు, మహేంద్ర సింగ్ ధోనీ వీరందరికీ నష్టపరిహారం చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసింది. అదీకూడా 15 రోజుల్లో ఈ మొత్తం చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసింది...
అయితే ఆమ్రాపాలి రియల్ ఎస్టేట్ కంపెనీకి ధోనీయే అనాధికారిక యజమాని అంటూ కోర్టు దర్యాప్తులో తేలడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసే విషయం...
ఆమ్రాపాలి రియల్ ఎస్టేట్ కంపెనీలో అధికారికంగానే మాహీ సతీమణి సాక్షికి 25 శాతం వాటా ఉంది. అదీకాక ఆమ్రాపాలి గ్రూప్, మాతృసంస్థగా రితి స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీని రికార్డుల్లో చూపించారు...
ఈ కంపెనీ మహేంద్ర సింగ్ ధోనీకి చెందినదే. దీంతో ఈ మొత్తం స్కాం వెనక మాహీ అండ్ కో ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి...
ఆమ్రాపాలి రియల్ ఎస్టేట్‌లో కొనుగోలు చేసిన 1800 మందికి చెల్లించిన మొత్తం వేల కోట్లలో ఉంటుందని అంచనా. దీంతో మాహీకి ఐపీఎల్ ముందు పెద్ద సమస్యే వచ్చిందంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...