భారత బ్యాడ్మింటన్ ఆటగాడు సాయి ప్రణీత్ చరిత్ర సృష్టించాడు.  జపాన్ ఓపెన్ వరల్డ్ సూపర్-750 టోర్నమెంట్ లో సెమీ ఫైనల్స్ కి చేరుకున్నాడు. కాగా... ఈ టోర్నమెంట్ లో సెమీ ఫైనల్ కి చేరిన తొలి ఆటగాడిగా సాయి ప్రణీత్ చరిత్ర సృష్టించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సాయి ప్రణీత్ 21-12, 21-15 తేడాతో సుగియార్తో( ఇండోనేషియా) పై గెలిచాడు. దీంతో... సాయి ప్రణీత్ కి సెమీస్ బెర్త్ ఖరారు అయ్యింది.

ఫలితంగా జపాన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో సెమీస్ కు చేరిన తొలి భారత క్రీడాకారుడిగా గుర్తింపు సాధించాడు. ఏకపక్షంగా సాగిన పోరులో సాయి ప్రణీత్ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. తొలిగేమ్ సునాయాసంగా గెలిచిన సాయి... రెండో గేమ్ కూడా అదే జోరును కొనసాగించాడు. ఒక దశలో సుగియార్తో నుంచి ప్రతి ఘటన ఎదురైనా సాయి ప్రణీత్ ఎక్కడా తడపడకుండా ఆడి.. విజయం సాధించడం విశేషం.