టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మరోసారి తన చిరకాల ప్రత్యర్థి కామెంటేటర్‌ సంజయ్ మంజ్రేకర్ ను టీజ్ చేస్తూ వార్తల్లో నిలిచాడు. గత కొన్నేళ్లుగా వీరి మధ్య ఓ మినీ యుద్ధమే నడుస్తోంది. ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటూ ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. గత వరల్డ్ కప్ లో మొదట సంజయ్ జడేజా మీద ఎవరు ఊహించని విధంగా ఒక కామెంట్ చేశాడు.

 వన్డే వరల్డ్ కప్ లో ఆడిన జడేజాను సంజయ్ టెస్ట్ ప్లేయర్ అంటూ కామెంట్ చేశాడు. అలాగే అతనికి నేను ఏ మాంత్రం అభిమానిని కాలేనని పరిమిత ఓవర్లకు జడేజా లాంటి వాళ్లు అన్ ఫిట్ అని చెప్పాడు. అందుకు జడేజా కూడా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. నీ కంటే ఎక్కువ మ్యాచ్ లు ఆడిన ఘనత తనదని చెప్పడంతో మళ్ళీ మంజ్రేకర్ నుంచి కామెంట్ రాలేదు.  ఇక చాలా కాలం తరువాత మళ్ళీ వీరిద్దరి మధ్య మరొక ఆసక్తికరమైన సంభాషణ  నడిచింది. ఆదివారం జరిగిన రెండో టీ20లో కెఎల్.రాహుల్ ఆఫ్ సెంచరీ చేసినందుకు గాను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

ఈ క్రమంలో మంజ్రేకర్ స్పందిస్తూ.. విజయంలో కీలక పాత్ర పోషించిన బౌలర్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చి ఉంటే బాగుండేదని అన్నాడు.  అందుకు జడేజా బదిలిస్తూ.. ఆ బౌలర్ పేరు కూడా చెప్పు అంటూ టీజ్ చేశాడు. దానికి మంజ్రేకర్ హా..హా.. అంటూ నువ్వూ.. లేదా బుమ్రా దానికి అర్హులని చెబుతూ.. ఎందుకంటె బుమ్రా వేసిన నాలుగు ఓవర్లలో అతి తక్కువ పరుగులు ఇచ్చాడని ఎకానమీ బావుందని అన్నాడు. ఇక జడేజా ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసి 18 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు.