సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరోసారి విదేశాల్లో నిర్వహించడానికి బిసిసిఐ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ టోర్నీని నిర్వహించడానికి దుభాయ్ లో ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరికొందరయితే ఏకంగా షెడ్యూల్ కూడా ప్రకటించేశారు. ఈ ప్రచారం మరింత పెరిగి గందరగోళం ఏర్పడకుండా ఉండేందుకు ఐపిఎల్2019 నిర్వహణపై బిసిసిఐ ఓ ప్రకటన చేసింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019 పై చర్చించేందుకు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్(సీఓఏ) డిల్లీలో సమావేశం కానుందని బిసిసిఐ ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భద్రతా పరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం వున్నప్పటికి ఐపిఎల్12 సీజన్ ను ఇండియాలోనే నిర్వహించాలని సీఓఏ కూడా భావిస్తున్నట్లు తెలిపింది. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఐపిఎల్ ను విదేశాలకు తరలించినట్లు మాత్రం ఈసారి చేసే ప్రసక్తే లేదని బిసిసిఐ స్పష్టం చేసింది.
ఎప్పటిలాగే ఈ ఐపిఎల్ సీజన్ కూడా మార్చి 23 నుండి ప్రారంభం కానుందని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర అధికారులతో త్వరలో చర్చించి భద్రతాపరమైన అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఐపిఎల్ 2019 పూర్తి షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు బిసిసిఐ వెల్లడించింది.
ఇప్పటికే ఈ ఐపీఎల్ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం కూడా ముగిసింది. స్వదేశంలో పిచ్ లపై మంచి అవగాహన, ఆడిన అనుభవం వున్న రంజీ ఆటగాళ్లను కొన్ని ప్రాంచైజీలు కోట్లు వెచ్చించి మరీ కైవసం చేసుకున్నాయి. అయితే వీరిలో ఐపీఎల్ విదేశాలకు తరలిపోనుందన్న వార్త గుబులు రేపింది. తాజాగా బిసిసిఐ ప్రకటనతో ప్రాంఛైజీలు కూడా ఊపిరి పీల్చుకున్నాయి.
మరిన్ని వార్తలు
అందుకే నన్నెవరూ కొనలేదేమో: ఐపీఎల్ వేలంపై యువీ కామెంట్స్
యువరాజ్ సింగ్ కి ఫ్రాంఛైజీల షాక్..
ముంబై ఇండియన్స్‌కి యువీ.. ఇది దొంగతనమేనన్న అంబానీ
ఐపీఎల్-2019 వేలం: ఎవరిని ఎవరు కొన్నారు, సన్‌రైజర్స్ టీమ్ ఇదే
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 8, 2019, 5:25 PM IST