ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కి మొదటి రౌండ్ లో ఫ్రాంఛైజీలు షాకిచ్చాయి. ఈ రోజు మధ్యాహ్నం జైపూర్ లో ఐపీఎల్ -2019 క్రికెటర్ల వేలం మొదలైంది. కాగా.. మొదటి రౌండ్ లో యూవీని కొనుగోలు చేసేందుకు ఒక్క ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపించలేదు.

రూ.1కోటితో వేలంలోకి వచ్చినప్పటికీ.. ఆయనపై కనీసం ఒక్క ఫ్రాంఛైజీ కూడా దృష్టి పెట్టలేదు. గత సీజన్ లో అతని ప్రదర్శనతోపాటు ప్రస్తుత ఫామ్ ను పరిగణలోకి తీసుకున్న ఫ్రాంఛైజీ యాజమాన్యాలు అతడి కోసం పోటీపడలేదు. ఒకప్పుడు రూ.16కోట్లు పలికిన యువరాజ్..  గతేడాది రూ.2కోట్లకు కింగ్స్ పంజాబ్ కొనుగోలు చేసింది.

కాగా.. ఈసారి మొదటి రౌండ్ లో ఇప్పటి వరకు ఒక్కరు కూడా యూవీని తీసుకునేందుకు ఆసక్తి చూపకపోగా.. తర్వాతి రౌండ్లలోనూ తీసుకుంటారనే నమ్మకం లేకుండా పోయింది. యూవీతోపాటు మనోజ్ తివారి, పుజారా, మార్టిన్ గప్తిల్, బ్రెండన్ మెక్‌కలమ్, అలెక్స్ హేల్స్(ఇంగ్లాండ్)లపై ఫ్రాంఛైజీలు ఆసక్తి కనబర్చలేదు.