ఐపీఎల్-2019 వేలం పాటలో చివరి వరకు ఉత్కంఠ కలిగించింది యువరాజ్ సింగ్ వేలమే. సిక్సర్ల వీరుడిగా, విధ్వంసకర ఆటగాడిగా పేరొందిన యువీని చివరి రౌండ్ వరకు ఏ ఒక్క ఫ్రాంఛైజీ పట్టించుకోకపోవడంతో అతను సేల్ అవుతాడా లేదా అనే సందేహాలు తలెత్తాయి.

అయితే చివరి నిమిషంలో ముంబై ఇండియన్స్ యువరాజ్ సింగ్‌ను కనీస ధర రూ.కోటీకి కొనుగోలు చేసి ఉత్కంఠకు తెరదించింది. ఈ క్రమంలో వేలంపై యువీ స్పందించాడు. తొలి రౌండ్‌లో నన్ను ఎవరు కొననందుకు నేనేం బాధపడలేదు..

ఎందుకంటే అందుకు కారణమేంటో నాకు తెలుసు.. ఐపీఎల్ వేలంలో ఫ్రాంఛైజీల చూపంతా కొత్త కుర్రాళ్లపైనే ఉంటుంది. భీకర ఫాంలో ఉన్న యంగ్ టాలెంట్స్‌నే వాళ్లు ముందుగా కొనుగోలు చేస్తారు. నా కెరీర్‌లో నాకు ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి.

ఐపీఎల్ ప్రారంభంలో నన్ను దక్కించుకోవడానికి చాలా మంది పోటీపడేవారు. ఈసారి ఐపీఎల్‌లో ఏదో ఒక ఫ్రాంఛైజీ నన్ను దక్కించుకుంటుందని తాను ముందుగానే ఊహించానని యువీ పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్‌ టీమ్‌లో ఉన్నందుకు సంతోషంగా ఉంది..

 ఆ జట్టు కోచ్ జహీర్ ఖాన్, మెంటార్ సచిన్ టెండూల్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ ముగ్గరితో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. తన మీద ఎంతో నమ్మకం ఉంచి.. కొనుగోలు చేసిన ఆకాశ్ అంబానీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని యువరాజ్ సింగ్ స్పష్టం చేశాడు.

యువరాజ్ సింగ్ కి ఫ్రాంఛైజీల షాక్..

ముంబై ఇండియన్స్‌కి యువీ.. ఇది దొంగతనమేనన్న అంబానీ

ఐపీఎల్-2019 వేలం: ఎవరిని ఎవరు కొన్నారు, సన్‌రైజర్స్ టీమ్ ఇదే

‘ఐపీఎల్ వేలం... కపిల్ రూ.25కోట్లు పలికేవాడు’

ఐపీఎల్ వేలంపాటపై తివారీ ఆవేదనతో కూడిన ట్వీట్...