ఐపీఎల్-2019 వేలం పాటలో అభిమానులు ఎక్కువ టెన్షన్ పడింది యువరాజ్‌సింగ్ గురించే. టీమిండియాలో స్థానం కోల్పోవడంతో పాటు అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉన్న యువీ తనను ఎవరూ కొనరేమోనన్న భయంతో రేటును కోటికి తగ్గించుకున్నాడు.

అయినప్పటికి నిన్న యువరాజ్‌పై ఏ జట్టు యాజమాన్యం పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో యువీ మెరుపులు ఈ సీజన్‌లో కనిపించవేమోనని అనుకున్నారు. అయితే రెండో రౌండ్ చివరి నిమిషంలో యువరాజ్‌ను కనీస ధర కోటీ రూపాయలకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది.

అయితే యువీ ఎంపికపై ఆ జట్టు యజమాని ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ...యువీ, మలింగ కోసం మేం ఎక్కువగా బడ్జెట్ కేటాయించాం. యువీలాంటి ఆటగాడు కోటి రూపాయలకే మాకు దక్కడం ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద దొంగతనం.

అతడు గెలవాల్సిన ట్రోఫీలన్నీ గెలిచాడు.. అనుభవం ఉన్న ఆటగాళ్లతో పాటు యంగ్ క్రికెటర్లపైనా దృష్టి పెట్టామని... యువీ, మలింగలో మేం కొన్ని ప్రత్యేకతలను గుర్తించామని ఆకాశ్ పేర్కొన్నారు. ఇదే వేలంలో యువీతో పాటు శ్రీలంక స్టార్ పేసర్ లసిత్ మలింగను కూడా కనీస ధర రూ.2 కోట్లకు ముంబై జట్టు దక్కించుకున్న సంగతి తెలిసిందే. 

రూ.8కోట్లు పలికిన జయదేవ్ ఉనద్కత్

యువరాజ్ సింగ్ కి ఫ్రాంఛైజీల షాక్..

భారీ ధర పలికిన ఆంధ్రా క్రికెటర్ హనుమ విహారి

జడేజాను కొట్టబోయిన ఇషాంత్.. ఆలస్యంగా వెలుగులోకి

ఓడిపోయిన తర్వాత సెంచరీ గురించి ఎందుకు..?

ఐపీఎల్‌లో రాజోలు కుర్రాడు.. రేటెంతంటే..?