Asianet News TeluguAsianet News Telugu

భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్ : సంజూ శాంసన్ కు మరోసారి మొండిచెయ్యి.. మూడో వన్డే జట్టులోనూ దొరకని చోటు..

మూడో వన్డేలో కూడా భారత జట్టులో సంజూ శాంసన్ కు చోటు లభించకపోవడంతో అభిమానులు మండిపడుతున్నారు. 

India vs New Zealand, 3rd ODI, Sanju Samson not playing
Author
First Published Nov 30, 2022, 8:38 AM IST

భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య నవంబర్ 30 బుధవారం క్రైస్ట్ చర్చ్ లోని హాగ్ లే పార్కు వేదికగా మూడో వన్డే జరుగుతోంది. ఈ నిర్ణయాత్మక మూడో వన్డేలో న్యూజిలాండ్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ వేయడం కాస్త ఆలస్యం అయ్యింది. దీనికి కారణం వెట్ అవుట్ ఫీల్డ్ ఉండడమే. ఈ మ్యాచ్ అమెజాన్ ప్రైమ్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతోంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం ఏడు గంటల నుంచి ప్రసారం అవుతోంది.

అయితే, ఈమ్యాచ్ కు భారత జట్టును ఎంపిక చేసిన విధానం మరోసారి వివాదాస్పదంగా మారింది. బీసీసీఐ మేనేజ్మెంట్ మరోసారి సంజూ శాంసన్ కు మొండిచేయి చూపించింది. సంజూను బెంచ్ కే పరిమితం చేసింది. రెండో వన్డేలో భారత జట్టుకు ఏ జట్టునైతే ఎంపిక చేసిందో.. అదే జట్టును యధాతథంగా  మూడో వన్డే మ్యాచ్లోనూ కొనసాగించింది.

అయితే, తమ అభిమాన క్రికెట్ ఆటగాడు సంజూ శాంసన్ ను అన్యాయం జరిగిందని,  మరోసారి తుది జట్టులో ఎంపిక చేయడంలో వివక్ష చూపారని అభిమానులు మండిపడుతున్నారు. ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్ విషయంలో టీమిండియా ఎలాంటి వైఖరి అవలంభిస్తుందో స్పష్టం అయ్యిందని అభిమానులు విరుచుకుపడుతున్నారు. సంజూ శాంసన్ ఉన్ముక్త్ చంద్ లా మరో దేశానికి వలస వెళ్లడం మంచిదని సలహా ఇస్తున్నారు. 

ఇదిలా ఉండగా, న్యూజిలాండ్ రెండో వన్డేకు ఎంపిక చేసిన చివరి  జట్టులో ఓ మార్పు చేసింది. మైకెల్ బ్రేస్ వెల్ స్థానంలో ఆడమ్ జట్టులోకి వచ్చాడు. మూడు మ్యాచ్ ల ఈ వన్డే సిరీస్ లో తొలి వన్డేలో న్యూజిలాండ్ 7వికెట్ల భారీ తేడాతో విజయం సాధించగా, వర్షం కారణంగా రెండో వన్డే రద్దయింది. నేడు మూడో వన్డే జరుగుతున్న ఈ సిరీస్ లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది.

భారత మూడో వన్డే టీం.. 
శిఖర్ ధావన్ ( కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, శుభ్ మన్ గిల్, రిషబ్ పంత్, దీపక్ హూడా, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, చహల్, వాషింగ్టన్ సుందర్,  

న్యూజిలాండ్ మూడో వన్డే టీం..
కేస్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథీ, లోకీ ఫెర్గూసన్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే

Follow Us:
Download App:
  • android
  • ios