ఆసిస్ తో మరో నాలుగు రోజుల్లో జరగనున్న టీ20 సిరీస్ ని కైవసం చేసుకొని అమరజవానులకు అంకితమిస్తామని టీంఇండియా బౌలర్ మహ్మద్ షమీ అన్నారు. ఈ సిరిస్ గెలవడానికి శాయశక్తులా కృషి చేస్తున్నామని చెప్పారు.

సొంత గడ్డపై టీ20 సిరీస్ గెలవాలని టీంఇండియా సాధన చేస్తోందని షమీ అన్నారు. గెలవడానికి  ఎలా కష్టపడాలో అలా కష్టపడుతున్నామన్నారు.  ఈ సిరిస్ గెలిచి అమర జవాన్లకు అంకితమిస్తామన్నారు. పుల్వామా ఘటన తమను ఎంతో బాధించిందన్నారు. దేశ ప్రజలను కాపాడేందుకు జవాన్లు తమ ప్రాణాలను పణంగా పెట్టారన్నారు.

మరో నాలుగు రోజుల్లో ఆసిస్ తో భారత్ సొంత గడ్డపై తలపడనుంది. ఆసిస్ గడ్డపై జరిగిన టెస్టు, వన్డే సిరిస్ లను కైవసం చేసుకోగా.. టీ20 సిరీస్ మాత్రం డ్రాగా మిగిలింది. దీంతో.. ఈ సిరీస్ ని కూడా సొంతం చేసుకోవాలని టీం ఇండియా కృషి చేస్తుండగా... కనీసం ఈ సిరిస్ అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఆసిస్ జట్టు ప్రయత్నిస్తోంది.