Team India : గిల్ కోసం బలిపశువుగా మారిన స్టార్ ! గంభీర్, అగార్కర్ ఏందయ్యా ఇది !
Team India : గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ తీసుకున్న ఒక నిర్ణయం టీమిండియాకు పెద్ద సమస్యగా మారింది. శుభ్‌మన్ గిల్ కోసం ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్‌ను పక్కన పెట్టారు. వజ్రం లాంటి ప్లేయర్‌ను తీసేశారు ! గిల్ వరుస వైఫల్యాలు జట్టుకు పెద్ద సమస్యగా మారాయి.

గంభీర్, అగార్కర్ చేసిన ఆ ఒక్క తప్పు.. టీమిండియాకు ఇప్పుడు పెద్ద సమస్య !
భారత క్రికెట్ జట్టులో ఎంపిక విధానాలు, ఆటగాళ్ళ ఫామ్ ఎప్పుడూ చర్చనీయాంశమే. అయితే, ఇటీవల హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు టీమిండియాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ ఇద్దరూ కలిసి యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ను భారత టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమించారు.
కానీ, ప్రస్తుతం ఈ ఫార్మాట్‌లో గిల్ ప్రదర్శన చూస్తుంటే, అసలు అతను ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండటానికి అర్హుడేనా అనే సందేహాలు కలుగుతున్నాయి. కేవలం గిల్ కు స్థానం కల్పించడం కోసం వజ్రం లాంటి ఆటగాడు సంజూ శాంసన్‌ను పక్కన పెట్టడం జట్టుకు నష్టంగా మారింది.
గంభీర్, అగార్కర్ వ్యూహం బెడిసికొట్టిందా?
జట్టు మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు భారత జట్టుకే ప్రతికూలంగా మారాయి. శుభ్‌మన్ గిల్‌ను కేవలం వైస్ కెప్టెన్‌గా చేయడమే కాకుండా, అతని కోసం ఓపెనింగ్ జోడిని కూడా మార్చేశారు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ జోడిని విడదీసి, గిల్ ను ఓపెనర్‌గా ఫిక్స్ చేశారు.
గిల్ కు స్థానం కల్పించే క్రమంలో సంజూ శాంసన్ టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ నుంచే పూర్తిగా అవుట్ అయ్యాడు. ఒకవైపు గిల్ నిలకడలేక సతమతమవుతుంటే, మరోవైపు అద్భుతమైన ప్రతిభ ఉన్న శాంసన్ బెంచ్ కు పరిమితం కావడం గమనార్హం. గిల్ కోసం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు జట్టు సమతుల్యతను దెబ్బతీసింది.
గిల్ పేలవ ఫామ్ పై ఆందోళన
శుభ్‌మన్ గిల్ కు భారత టీ20 జట్టులో స్థానం దక్కడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దక్షిణాఫ్రికాతో కటక్‌లో మంగళవారం జరిగిన మొదటి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో గిల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. గణాంకాలను పరిశీలిస్తే, గత ఏడాదిన్నర కాలంగా గిల్ బ్యాట్ నుండి టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా రాలేదు.
అతని చివరి 16 ఇన్నింగ్స్‌ల స్కోర్లు వరుసగా 13, 34, 39, 20*, 10, 5, 47, 29, 4, 12, 37*, 5, 15, 46, 29* 4 పరుగులు ఉన్నాయి. ఈ వరుస వైఫల్యాలు చూస్తుంటే, గిల్ ఎక్కువ కాలం టీ20 జట్టులో కొనసాగడం కష్టంగానే కనిపిస్తోంది.
వజ్రం లాంటి ఆటగాడిపై వేటు వేయడం పై విమర్శలు
గణాంకాల పరంగా చూస్తే సంజూ శాంసన్ మెరుగైన స్థితిలో ఉన్నారు. శుభ్‌మన్ గిల్ ఇప్పటివరకు భారత్ తరఫున 34 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడి 140.63 స్ట్రైక్ రేట్‌తో 841 పరుగులు చేశారు. అలాగే ఐపీఎల్‌లో 118 మ్యాచ్‌లలో 138.72 స్ట్రైక్ రేట్‌తో 3866 పరుగులు సాధించారు.
అయితే, టీ20 ఫార్మాట్‌లో స్ట్రైక్ రేట్ విషయంలో గిల్, సంజూ శాంసన్ ముందు తేలిపోతున్నాడు. సంజూ శాంసన్ వంటి అద్భుతమైన క్రికెటర్‌ను ప్లేయింగ్ ఎలెవన్ నుండి తప్పించడం టీమిండియాకు నష్టం కలిగిస్తోందనడంలో సందేహం లేదు.
సంజూ శాంసన్ మెరుగైన గణాంకాలు
ప్రస్తుత గణాంకాలను బట్టి చూస్తే శుభ్‌మన్ గిల్ భారత టీ20 జట్టులో చోటుకు అర్హుడు కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సంజూ శాంసన్ రికార్డులు అద్భుతంగా ఉన్నాయి. అతను భారత్ తరఫున ఇప్పటివరకు 51 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడి 147.40 అనే మెరుగైన స్ట్రైక్ రేట్‌తో 995 పరుగులు సాధించారు. ఇందులో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఐపీఎల్‌లో కూడా సంజూ శాంసన్ 177 మ్యాచ్‌లలో 139.04 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 4704 పరుగులు చేశారు. ఇంతటి ట్రాక్ రికార్డ్ ఉన్న ఆటగాడిని పక్కన పెట్టడం నిజంగా ఆశ్చర్యంగా క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాలకు బలైన ఆటగాడు
శుభ్‌మన్ గిల్ కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కల్పించడం కోసమే మొదట సంజూ శాంసన్‌ను ఓపెనింగ్ స్థానం నుండి తప్పించారు. ఆ తర్వాత లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయించి, అతని బ్యాటింగ్ పొజిషన్‌లో నిరంతరం మార్పులు చేశారు. ఈ అస్థిరత క్రమంలో శాంసన్ ఫామ్ దెబ్బతింది, ఫలితంగా అతన్ని తుది జట్టు నుండి తొలగించారు.
ఇప్పుడు సంజూ శాంసన్ స్థానంలో జితేష్ శర్మకు వికెట్ కీపర్ బ్యాటర్‌గా అవకాశం కల్పిస్తున్నారు. మొత్తానికి గంభీర్, అగార్కర్ తీసుకున్న నిర్ణయాలు ఒక ప్రతిభావంతుడైన ఆటగాడికి శాపంగా మారాయని చెప్పవచ్చు. మరి రాబోయే సిరీస్ లలోనైనా సంజూ శాంసన్ కు ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి మరి.

