చాలా రోజుల తర్వాత టీం ఇండియా యువ క్రికెటర్ హార్దిక్ పాండ్యా  బయటకు వచ్చారు. కాఫీ విత్ కరణ్ షోలో మహిళలను కించపరిచే విధంగా కామెంట్స్ చేసి.. పాండ్యా, కేఎల్ రాహుల్ లు వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. వీరిపై బీసీసీఐ నిషేధం విధించడంతో.. ఆస్ట్రేలియా నుంచి ఇండియా వచ్చేశారు.

ఇండియా వచ్చేసిన తర్వాత నుంచి పాండ్యా ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టడం లేదని.. చాలా బాధపడుతున్నాడని, ఎవరు ఫోన్ చేసినా స్పందించడం లేదని. అతని తండ్రి హిమాన్షు  మీడియా తో చెప్పారు. అతని సోదరుడు కృనాల్ కూడా పాండ్యా కామెంట్స్ పై తానేమీ మాట్లాడాలనుకోవడం లేదని చెప్పారు. కాగా.. తాజాగా.. పాండ్యా ఇంటి నుంచి బయటకు వచ్చారు.

ముంబయి ఎయిర్ పోర్టులో మీడియా కంటికి చిక్కాడు. తన సోదరుడు కృనాల్ పాండ్యాతో కలిసి హార్దిక్.. ముంబయి ఎయిర్ పోర్టులో కినిపించాడు. కాగా.. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం పాండ్యాతో పాటు కేఎల్ రాహుల్ కూడా నిషేధం ఎదుర్కొంటున్నాడు. మరి వీరిద్దిరిని మళ్లీ ఎప్పుడు టీంలోకి తీసుకుంటారో చూడాలి.