MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అన్నదమ్ములిద్దరం ఒకే అమ్మాయిని ప్రేమించడం వల్లే జనాలు ఛీ కొట్టారు..తన బ్రదర్ గురించి అల్లరి నరేష్ కామెంట్స్

అన్నదమ్ములిద్దరం ఒకే అమ్మాయిని ప్రేమించడం వల్లే జనాలు ఛీ కొట్టారు..తన బ్రదర్ గురించి అల్లరి నరేష్ కామెంట్స్

అల్లరి నరేష్ బలమే కామెడీ. తన తండ్రి ఈవీవీ సత్యనారాయణ అండదండలతో.. తన కామెడీ టైమింగ్ తో టాలీవుడ్ లో అల్లరి నరేష్ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 30 2024, 03:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అల్లరి నరేష్ బలమే కామెడీ. తన తండ్రి ఈవీవీ సత్యనారాయణ అండదండలతో.. తన కామెడీ టైమింగ్ తో టాలీవుడ్ లో అల్లరి నరేష్ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ తరహాలో కామెడీ చిత్రాలతో అల్లరి నరేష్ దూసుకుపోయాడు. కానీ ఆ తర్వాత అల్లరి నరేష్ కి సరైన హిట్ దక్కలేదు. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

దీనితో అల్లరి నరేష్ మహర్షి లాంటి చిత్రాల్లో ఎమోషనల్ క్యారెక్టర్ రోల్స్ చేశారు. ఇటీవల తిరిగి హీరోగా చిత్రాలు చేస్తున్నాడు కానీ.. అల్లరి నరేష్ నుంచి ఫ్యాన్స్ ఆశించే కామెడీ చిత్రం మాత్రం రావడం లేదు. ఎట్టకేలకు అల్లరి నరేష్ ఆ కోరిక తీర్చబోతున్నాడు. 

37

అల్లరి నరేష్ నటించిన 'ఆ ఒక్కటీ అడక్కు' చిత్రం మే 3 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. పెళ్లి కాని వ్యక్తి మ్యాట్రిమోనీ సంస్థల చుట్టూ తిరుగుతూ ఎదుర్కొనే ఇబ్బందులని ఫన్నీగా చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. 

47

ఈ చిత్రం కోసం అల్లరి నరేష్ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ విశేషాలని కూడా అల్లరి నరేష్ వివరించాడు. ఈ క్రమంలో తన సోదరుడు ఆర్యన్ రాజేష్ తో కలసి నటించడంపై అల్లరి నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మీ బ్రదర్ ఆర్యన్ తో కలసి నటించే ఆలోచన ఉందా అని అడగగా.. ఇప్పట్లో లేదని నరేష్ తేల్చి చెప్పాడు. దానికి కారణం కూడా వివరించారు. 

57

గతంలో మేమిద్దరం కలసి నటించి పెద్ద తప్పు చేశాం. అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్ కలసి నటించిన చిత్రం నువ్వంటే నాకిష్టం.  అల్లరి నరేష్ నాన్న గారు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలోనే ఈ చిత్రం తెరకెక్కింది. నేను, రాజేష్ ఆ చిత్రంలో కలసి నటించడం వల్ల తప్పు జరిగింది. ఆ మూవీలో మేమిద్దరం ఒకే అమ్మాయిని ప్రేమిస్తాం. 

67

అల్లరి నరేష్ లేఎలా చిత్రంలో మేమిద్దరం అన్నదమ్ములం కాదు. కానీ అల్లరి నరేష్, ఆర్యన్ ఇద్దరూ రియల్ లైఫ్ లో బ్రదర్స్ అనే విషయం ఆడియన్స్ కి తెలుసు. ఆ మూవీలో మేమిద్దరం ఒకే అమ్మాయిని ప్రేమించినప్పటికీ ఆడియన్స్ జీర్ణించుకోలేకపోయారు. బ్రదర్స్ ఒకే అమ్మాయితో ప్రేమలో పడడం ఏంటి అని ఛీ కొట్టారు. ఫలితంగా మూవీ ఫ్లాప్ అయింది అని అల్లరి నరేష్ పేర్కొన్నాడు. టెస్ట్ ఫోటో గ్యాలరీ

77

అలాంటి తప్పు రిపీట్ కాకుండా చూడాలి. బ్రదర్ సెంటిమెంట్ తో మంచి కథవస్తే అప్పుడు ఆలోచిస్తాం అని అల్లరి నరేష్ తెలిపాడు. నాన్నగారి గుర్తుగా తన కుమార్తెకి కూడా ఇవికా అని పేరు పెట్టినట్లు అల్లరి నరేష్ తెలిపాడు. మా ఇంట్లో మొత్తం గడ్డాలు మీసాలే.. నాకు కూతురు జన్మించడం చాలా సంతోషంగా ఉందని అల్లరి నరేష్ పేర్కొన్నాడు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Aishwarya Rai కి క్షమాపణ చెప్పిన బాలకృష్ణ హీరోయిన్.. సడెన్ గా సినిమాల నుంచి మాయం, ఏం జరిగింది ?
Recommended image2
Anushka Shetty: అనుష్క శెట్టి కెరీర్ లో 5 చెత్త సినిమాలు..ఆ రెండు చిత్రాల జోలికి వెళ్లకుండా ఉండాల్సింది
Recommended image3
Trisha Krishnan: విజయ్ ఈవెంట్‌లో అందరి కళ్లు ఆమెపైనే! త్రిష గ్లామర్ దెబ్బకు సోషల్ మీడియా షేక్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved