Asianet News TeluguAsianet News Telugu

సిడ్నీ టెస్ట్: బౌలర్ల జోరును అడ్డుకున్న వర్షం...అయినా మూడోరోజు భారత్‌దే

బోర్డర్-గవస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో మూసిస్ బ్యాట్ మెన్స్ నిలకడగా ఆడుతున్నారు. ఓవర్ నైట్ స్కోరు 24 పరుగుల వద్ద బ్యాటింగ్ కు దిగిన ఓపెనర్లు మార్కస్ హారిస్, ఖవాజాలు ఆచితూచి బ్యాటింగ్ చేశారు. భారత బౌలర్లకు దీటుగా ఎదుర్కొంటూ నెమ్మదిగా స్కోరు బోర్డును ముందుకు కదిలిస్తున్నారు.

sydney test third day updates
Author
Sydney NSW, First Published Jan 5, 2019, 7:35 AM IST

ఇప్పటికే బోర్డర్ గవాస్కర్ ట్రోపిలో భాగంగా జరుగుదతున్న టెస్ట్ సీరిస్ లో భారత జట్టు ముందంజలో వున్న విషయం తెలిసిందే. వారి దేశంలో జరుగుతున్న టెస్ట్ సీరిస్ లో ఆసిస్ జట్టును రెండు టెస్టుల్లో ఓడించిన భారత్ 2-1 తేడాతో ముందంజలో ఉంది.ఈ సీరిస్ విజయాన్ని నిర్దేశించే సిడ్నీ టెస్టులోనే టీంఇండియా జోరు కొనసాగుతోంది. ఈ టెస్టులో మూడో రోజైన ఇవాళ భారత బౌలర్ల విజృంభనతో 623 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసిస్ కేవలం 236 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

అయితే భారత బౌలర్లు మంచి జోరుమీదున్న సమయంలో వర్షం ఆటకు ఆటంకం కల్గించింది. వర్షం తగ్గేలా కనిపించకపోవడంతో మూడో రోజు ఆటను ఇక్కడితోనే ముగిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. ఆట ముగిసే సమయానికి క్రీజులో హ్యండ్స్‌కబ్(28 పరుగులు),  కమ్మిన్స్ 25 (పరుగులు) బ్యాటింగ్ చేస్తున్నారు. భారత బౌలర్లలొ కుల్దీప్ 3, జడేజా 2, షమి 1 వికెట్ పడగొట్టారు.

నిర్ణయాత్మక చివరి టెస్టులో భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ విజృంబిస్తున్నాడు. ఆసిస్ బ్యాట్ మెన్స్ ని క్రీజులో కుదురుకోనివ్వకుండా వెంట వెంటనే పెవిలియన్ కు పంపిస్తున్నాడు. ఆసిస్ స్కోరు 192 పరుగుల వద్ద హెడ్ ను ఔట్ చేసిన కుల్దీప్ ఆ  వెంటనే బ్యాటింగ్ వచ్చిన ఆసిస్ కెప్టెన్ కూడా 198 పరుగుల  వద్దే పెవిలియన్ కు పంపించాడు. దీంతో ఆసిస్ ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఆ జట్టు 203 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది.

సిడ్నీ టెస్టులో భారత బౌలర్ల హవా కొనసాగుతోంది. భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసిస్ ఆసిస్ బ్యాట్ మెన్స్ భారత బౌటర్ల దాటికి పెవిలియన్  బాటపట్టారు. కేవలం 192 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా కష్టాల్లోపడింది. 

భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ ఐదో వికెట్ పడగొట్టాడు. 56 బంతుల్లో 20 పరుగులు చేసిన హెడ్ ఐదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో హ్యాండ్స్‌కబ్(21 పరుగులు), ఆసిస్ కెప్టెన్ ఫైన్ (5 పరుగులు) బ్యాటింగ్ చేస్తున్నారు.   

సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచులో శనివారం ఆటలో రవీంద్ర జడేజా ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ పాలిట శాపంగా మారాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్సులో 152 పరుగులకు నాలుగో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగులో రహానే తన అద్భుతమైన క్యాచ్ తో షాన్ మార్ష్ ను పెవిలియన్ కు చేర్చాడు. మార్ష్ కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు.

బోర్డర్-గవస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసిసిస్ బ్యాట్ మెన్స్ నిలకడగా ఆడుతున్న సమయంలో భారత స్పిన్నర్లు విజృంభిస్తున్నారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్సులో 144 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. జడేజా రెండు వికెట్లు తీసుకోగా, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీసుకున్నాడు.  ఓవర్ నైట్ స్కోరు 24 పరుగుల వద్ద బ్యాటింగ్ కు దిగిన ఓపెనర్లు మార్కస్ హారిస్, ఖవాజాలు ఆచితూచి బ్యాటింగ్ చేశారు. భారత బౌలర్లకు దీటుగా ఎదుర్కొంటూ నెమ్మదిగా స్కోరు బోర్డును ముందుకు కదిలిస్తున్నారు.

ఈ క్రమంలో ఖవాజా స్కోరు వేగాన్ని పెంచడానికి ప్రయత్నించి 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్నస్‌ లబుషానెతో కలిసి మార్కస్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ అర్థ శతాకాన్ని నమోదుచేశాడు. ప్రస్తుతం అతడు 77 పరుగులు 109 బంతుల్లో సాధించి సెంచరీ వైపు సాగుతున్నాడు. అతడి తోడుగా క్రీజులో వున్న లబుషానే 18 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. 

రెండోరోజు భారత బ్యాట్ మెన్స్ రెచ్చిపోవడంతో టీంఇండియా 622 భారీ పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను ఢిక్లేర్ చేసింది. పుజారా, రిషబ్ పంత్ లు సెంచరీల మోత మోగించడంతో భారత్ ఇంత భారీ స్కోరు సాధించింది. మొత్తానికి రెండో రోజు మ్యాచ్ లో ఆధిక్యాన్ని కొనసాగించిన టీంఇండియా మూడో రోజు ఆసిస్ బ్యాట్ మెన్స్ ని అడ్డుకోడానాకి కాస్త కష్టపడాల్సి వస్తోంది.  

మరిన్ని వార్తలు

ధోని పాకిస్థాన్ రికార్డును బద్దలుగొట్టిన పంత్.... 12ఏళ్ల తర్వాత

బ్యాటింగ్ తో దుమ్మురేపిన పంత్.. అభిమానుల పాట

రికార్డ్ బ్రేక్: ధోనీ వల్ల కానిది పంత్ సాధించాడు

సిడ్నీ టెస్ట్: 622 పరుగుల వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్

సిడ్నీ టెస్ట్: ముగిసిన తొలి రోజు ఆట, భారత్ 303/4

మయాంక్ రికార్డుల మోత

సచిన్ ముందు, వెనుక స్థానాలు పుజారావే...

పింక్ గ్లౌవ్స్, బ్యాట్‌తో బరిలోకి దిగిన కోహ్లీ ...విశేషమేంటబ్బా?

నల్లటి బ్యాడ్జీలతో గ్రౌండ్‌లోకి దిగిన ఆసీస్, భారత్ క్రికెటర్లు...ఎందుకంటే

పుజారా రికార్డు: దిగ్గజాల జాబితాలో చోటు

Follow Us:
Download App:
  • android
  • ios