బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ పెవిలియన్‌కు చేరాడు. అయితే పుజారాతో కలిసి కొత్త కుర్రాడు మయాంక్ అగర్వాల్ ముందుండి నడిపించాడు.

వీరిద్దరూ క్రీజులో కుదురుకుంటున్న దశలో మయాంక్ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం కెప్టెన్‌ కోహ్లీ జతగా పుజారా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలో పుజారా హాఫ్ సెంచరీ సాధించాడు,

ఈ దశలో విరాట్ కోహ్లీ 23 పరుగుల వద్ద ఔటయ్యాడు. అనంతరం రహానెతో కలిసి పుజారా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 48 పరుగులు జోడించారు. ఈ క్రమంలో రహానే 228 పరుగుల వద్ద ఔటయ్యాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన హనుమ విహారి అండగా పుజారా మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తపడ్డాడు. ఈ దిశలో పుజారా టెస్టుల్లో 18వ సెంచరీని సాధించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టగా, స్టార్క్, లయన్‌లకు తలో వికెట్ పడగొట్టాడు.