బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టుకు భారత్-ఆస్ట్రేలియా క్రికెటర్లు నల్లటి బ్యాడ్జీలతో గ్రౌండ్‌లో అడుగుపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టుకు భారత్-ఆస్ట్రేలియా క్రికెటర్లు నల్లటి బ్యాడ్జీలతో గ్రౌండ్‌లో అడుగుపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటు వినోద్ కాంబ్లీ వంటి క్రికెటర్లను భారతదేశానికి అందించిన ద్రోణాచార్య అవార్డ్ గ్రహీత, క్రికెట్ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ మృతికి సంతాపంగా టీమిండియా ఆటగాళ్లు నల్లటి బ్యాడ్జీలతో నివాళులర్పించారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలో బుధవారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అచ్రేకర్ మృతికి సంతాపంగా పలువురు క్రికెటర్లు, అభిమానులు ఆయనకు నివాళుర్పించారు. మరోవైపు ఆసీస్ వెటరన్ క్రికెటర్‌ బిల్ వాట్సన్ మృతికి సంతాపంగా ఆసీస్ క్రికెటర్లు చేతికి నల్లబ్యాడ్జీలు ధరించి మైదానంలోకి దిగారు. 

సచిన్‌కు క్రికెట్ ఓనమాలు నేర్పిన మాస్టర్ ఇకలేరు...

Scroll to load tweet…