తన ఆటతీరుతో భారతీయ అభిమానుల మనసులను టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దోచుకున్నాడు. కానీ ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సీరిస్లో ఆసిస్ ఆటగాళ్ల కవ్వింపులకు భయపడకుండా ఎదురుతిరిగి దీటుగా జవాబిచ్చి ఆ దేశ అభిమానుల దృష్టిలో విలన్ గా మారాడు. తమ క్రికెటర్లతో గొడవకు దిగిన కోహ్లీపై ద్వేషంతో కొందరు అభిమానులు ఏకంగా గ్రౌండ్ లోనే జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. అయితే సిడ్నీ టెస్టులో మానవతా దృక్పథంతో కోహ్లీ చేసిన ఓ పని అస్ట్రేలియా అభిమానుల చేతే శభాష్ అనిపించుకుంటోంది.

ఆసీస్ మాజీ లెజెండరీ ప్లేయర్ గ్లెన్ మెక్‌గ్రాత్ భార్య జేన్ మెక్‌గ్రాత్ బ్రెస్ట్ క్యాన్సర్ కారణంగా మృతిచెందింది. దీంతో తీవ్ర కలత చెందిన మెక్‌గ్రాత్ తన భార్య జ్ఞాపకార్థం మెక్‌గ్రాత్ ఫౌండేషన్ ను ఏర్పాటుచేసి క్యాన్సర్ పై పోరాడుతున్నారు. కేన్సర్ భారిన పడిన వారి చికిత్స కోసం సాయం చేయడం...ఇది రాకుండా ప్రచారం నిర్వహించడానికి మెక్‌గ్రాత్ ఫౌండేషన్ సాయం చేస్తుంది.
మెక్‌గ్రాత్ చేస్తున్న ఈ మంచి పనికి క్రికెట్ ఆస్ట్రేలియా కూడా మద్దతుగా నిలిచింది. దీంతో 2009 నుండి ప్రతి ఏటా సిడ్నీలో ఇలా పింక్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మ్యాచ్‌కు వాడే స్టంప్స్, బౌండరీ లైన్స్ అన్నీ పింక్ కలర్‌లోనే ఉంటాయి.ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా పింక్ కలర్ కిట్ తోనే బరిలోకి దిగుతారు. తాజాగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ ను పింక్ టెస్టుగా నిర్వహిస్తోంది.
ఈ మ్యాచ్ గురించి తెలుసుకున్న విరాట్ కోహ్లీ తనవంతు సాయం చేయాలని బావించాడు. అందుకోసమే అతడు పింక్ గ్లోవ్స్, బ్యాట్‌తో వచ్చి మద్దతు తెలిపాడు. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు, మాజీలతో పాటు అభిమానులు కూడా కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇక ఇదే సిడ్నీ టెస్ట్‌లో రెండు జట్ల సభ్యులూ నల్లటి రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు.మాజీ క్రికెటర్ సచిన్ గురువు రమాకాంత్ అచ్రేకర్ మృతికి సంతాపంగా టీంఇండియా ఆటగాళ్లు, ఆసీస్ వెటరన్ క్రికెటర్ బిల్ వాట్సన్ మృతికి సంతాపంగా ఆసీస్ క్రికెటర్లు చేతికి నల్లబ్యాడ్జీలు ధరించి మైదానంలోకి దిగారు.