ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ లో భాగంగా  ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య  నాలుగో టెస్టు సెప్టెంబర్ 4 వ తేదీన మాంచెస్టర్ వేదికగా జరగనుంది. లార్డ్స్ టెస్టులో గాయపడిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్... గాయం నుంచి కోలుకున్నాడు. తిరిగి నాలుగో టెస్టులో తన బ్యాట్ ని స్మిత్ జులిపించనున్నాడు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జోఫ్రా ఆర్చర్ విసిరిన బౌన్సర్ స్టీవ్ స్మిత్ మెడకు బలంగా తగిలింది.

దీంతో.. తీవ్రంగా గాయపడిన స్మిత్.. మైదానంలో కుప్పకూలాడు. కాగా.. ఫిజియో వెంటనే మైదానంలోకి వచ్చి అతనికి చికిత్స అందించారు. దీంతో.. కాస్త కోలుకున్న స్మిత్ మూడో మ్యాచ్ కి దూరమయ్యాడు. స్మిత్ లేని కారణంగా జట్టు ఓటమిపాలయ్యింది. అయితే... గాయం నుంచి ఇప్పుడు పూర్తిగా కోలుకున్న స్మిత్.. నాలుగో టెస్టులో ఆడతారని జట్టు సభ్యులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా..నాలుగో టెస్టుకి స్మిత్ సిద్ధమౌతుండగా... మరో క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా ఈ మ్యాచ్ కి దూరం కానున్నాడు. మూడు మ్యాచుల్లో ఆడిన ఖవాజాకు నాలుగో టెస్టులో విశ్రాంతి ఇచ్చారు.  బుధవారం జరగనున్న ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో చూడాలి. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చెరో మ్యాచ్ గెలిచాయి. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇంకా రెండు మ్యాచ్ లు జరగాల్సి ఉంది.