అబుదాబి: ఐపిఎల్ సీజన్ 13లో వరుస ఓటములతో సతమతమవుతున్న ధోని సేనకు మరో షాక్ తగిలింది. శనివారం డిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడ్డ చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో ఈ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడు కోలుకోడానికి వారాల సమయం పట్టే అవకాశం వుందని సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వెల్లడించారు. 

''డిల్లీతో జరిగిన మ్యాచ్ లో బ్రావో గాయపడటం దురదృష్టకరం. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అయిన బ్రావో చివరి నిమిషంతో తప్పుకోవడంతో డిల్లీ చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. చివరి ఓవర్ జడేజాతో వేయించాలన్నది తమ వ్యూహం కాకపోయినా బ్రావో గాయపడటంతో తప్పలేదు. అయితే ఆ ప్రయత్నం విఫలమయయ్యింది'' అని ఫ్లెమింగ్ తెలిపాడు. 

డిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్లో బ్రావోకు గజ్జలో గాయం కావడంతో మైదానాన్ని వీడాడు. చెన్నై నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన డిల్లీ జట్టు మరో బంతి మిగిలుండగానే ఛేదించింది. గాయంతో చివరి ఓవర్ వేయకుండానే బ్రావో మైదానాన్ని వీడటంతో విజయం డిల్లీ విజయం మరింత తేలికయ్యింది. 

read more  IPL2020: ఆశ్చర్యం... ఐపిఎల్ లో మహిళా అంపైరా!

సున్నాకే తొలి వికెట్‌ కోల్పోయినప్పటికి 180 పరుగుల లక్ష్యాన్ని ఆఖరి ఓవర్‌‌లో రెండు బంతులు మిగిలి ఉండగానే చేధించి రికార్డు విజయం అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకున్న ఢిల్లీ, చెన్నై సూపర్ కింగ్స్‌ను కష్టాల్లోకి నెట్టేసింది.

180 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌కి తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. పృథ్వీ షా డకౌట్ కాగా అజింకా రహానే 8 పరుగులకి అవుట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ 23 పరుగులు చేసి అవుట్ కాగా, మార్కస్ స్టోయినిస్ 14 బంతుల్లో ఓ ఫోర్, రెండు సిక్సర్లతో 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఓ వైపు వికెట్లు పడుతున్నా శిఖర్ ధావన్ బౌండరీలతో ఒంటరిపోరాటం చేశాడు. 58 బంతుల్లో 14 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 101 పరుగులతో అజేయ శతకం బాదాడు. విజయానికి 5 బంతుల్లో 15 పరుగులు కావాల్సిన దశలో అక్షర్ పటేల్ హ్యాట్రిక్ సిక్సర్లు బాది మ్యాచ్‌ను ముగించాడు. ఈ విజయంతో మళ్లీ టాప్‌లోకి వెళ్లింది ఢిల్లీ క్యాపిటల్.