వన్డే సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ

Alex Hales to miss first one-day international because of injury
Highlights

ఇప్పటికే స్వదేశంలో ఆడిన టీ20 సిరీస్ లో భారత్ చేతిలో ఓటమిపాలై పరాభవంతో ఉన్న ఇంగ్లాండ్ జట్టుకు మరో ఎదుదెబ్బ తగిలింది. ఇవాళ జరిగే మొదటి వన్డే నుండి ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ అలెక్స్ హేల్స్  దూరమయ్యాడు. అతడు నెట్ లో ప్రాక్టీస్ చేస్తుండగా తీవ్రంగా గాయపడినట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది.

ఇప్పటికే టీ20 సిరీస్ పరాభవంతో రగిలిపోతున్న ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. భారత్ చేతిలో స్వదేశంలో జరిగిన టీ20 సీరీస్ ను 2-1 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే వన్డేల్లో మాత్రం ఎట్టిపరిస్థితుల్లో గెలిచి ఐసిసి వన్డే ర్యాకింగ్స్ లో టాప్ ప్లేస్ ను నిలబెట్టుకోవాలని ఇంగ్లాండ్ పట్టుదలతో ఉంది. అదేవిధంగా ఐసిసి టాప్ ర్యాకింగ్స్ లో రెండో స్థానంలో ఉన్న టీంఇండియా ఈ సీరీస్ ను వైట్ వాష్ చేసి అగ్రస్థానికి ఎగబాకాలని ఉవ్విళ్లూరుతోంది. దీంతో ఈ వన్డే సీరీస్ రెండు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారింది.

ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో అలెక్స్ హేల్స్ అద్భుతంగా రాణించాడు. అయితే ఇదే ఊపును వన్డేల్లోనూ ప్రదర్శిస్తాడని ఇంగ్లాండ్ జట్టు అతడిపై చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సమయంలో అతడు పక్కటెముకల గాయంతో ఇబ్బంది పడుతూ మొదటి వన్డే నుండి తప్పుకున్నాడు, అతని స్థానంలో డావిడ్ మలాన్‌ను జట్టులోకి తీసుకున్నట్లు ఇంగ్లాండ్ బోర్డు ప్రకటించింది.

హేల్స్ ని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, తొందరగా కోలుకునేందుకు కావాల్సిన చికిత్స అందిస్తున్నట్లు ఇంగ్లాండ్ బోర్డు వివరించింది. అతడు త్వరగా కోలుకుని రెండో వన్డేకు అందుబాటులోకి వస్తాడని భావిస్తున్నట్లు బోర్డు తెలిపింది.

loader