బోర్డర్-గవాస్కర్ ట్రోఫిలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 250 పరుగులకు అలౌట్ అయ్యింది. ఓవర్‌నైట్ స్కోరు 250/9తో రెండో రోజు ఆట ప్రారంభించిన తొలి బంతికే టీమిండియా వికెట్ కోల్పోయి అలౌట్ అయ్యింది.

హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో మహ్మద్ షమీ పైన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. వికెట్లు పడుతున్నా చతేశ్వర పుజారా అద్భుతంగా ఆడి సెంచరీతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు.  మరోవైపు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ఓపెనర్ పించ్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 14.1 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. మార్కస్ హారీస్ 16, ఉస్మాన్ ఖవాజా 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

ఆడటం వచ్చా..టీమిండియా చెత్త బ్యాటింగ్‌పై గావస్కర్ ఫైర్

ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. పుజారా ఖాతాలో రెండు అరుదైన రికార్డులు

అడిలైడ్ టెస్ట్: పుజారా ఒంటరి పోరు, తొలి రోజు భారత్ 250/9

వికెట్ పారేసుకున్న రోహిత్... మాజీలు, అభిమానుల ఆగ్రహం