Asianet News TeluguAsianet News Telugu

మానవుని పంచమహా యజ్ఞములు

పంచ మహాయజ్ఞములు అనగా హిందూ ధర్మశాస్త్రాలననుసరించి గృహస్థు ఆచరించవలసిన ఐదు యజ్ఞములు. మానవుని జీవితంలో ఉండే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అనే నాలుగు ఆశ్రమధర్మాలు అని ఉంటాయి. ఈ నాలుగింటిలో ముఖ్యమైనది, 

The Panchamaha Yajnas of man
Author
Hyderabad, First Published May 31, 2021, 2:59 PM IST


డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

సనాతన భారతదేశంలో పురాణకాలం నుండి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి. యజ్ఞం అనేది ఒక విశిష్టమైన హిందూ సంప్రదాయం. దేవతలకు తృప్తి కలిగించడం యజ్ఞం లక్ష్యం. సాధారణంగా యజ్ఞం అనేది అగ్ని (హోమం) వద్ద వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో వేసినవి అన్నీ దేవతలకు చేరుతాయి. ఇది ఇలా ఉండగా మానవునికి ఐదు మహా యజ్ఞములతో అనుభందం ముడిపడి ఉంటుంది అవేమిటో చూద్దాం..

పంచ మహాయజ్ఞములు అనగా హిందూ ధర్మశాస్త్రాలననుసరించి గృహస్థు ఆచరించవలసిన ఐదు యజ్ఞములు. మానవుని జీవితంలో ఉండే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అనే నాలుగు ఆశ్రమధర్మాలు అని ఉంటాయి. ఈ నాలుగింటిలో ముఖ్యమైనది, మిగిలిన మూడు ఆశ్రమములకు ఆధారమైనది గృహస్థ ఆశ్రమం. అయితే ఈ గృహస్థాశ్రమంలో ఉన్న వారు యజ్ఞములు చేస్తేనే వారికి పరమేశ్వరానుగ్రహం లభిస్తుంది. ఈ యజ్ఞములు ఐదు రకములు, అవి.. 

1. బ్రహ్మ యజ్ఞము, 

2. దేవ యజ్ఞము, 

3. పితృ యజ్ఞము, 

4. భూత యజ్ఞము, 

5. నృయజ్ఞము.


* బ్రహ్మయజ్ఞము :- ఈ యజ్ఞము ద్వారా గృహస్తుడు అనేక కొత్త విషయములను తెలుసుకుంటాడు. అంతేకాక మిగిలినవారికి కూడా తెలియజేస్తూ ఉంటాడు. ఈ యజ్ఞంలో భాగంగా గృహస్తుడు జ్ఞానమును ఆర్జిస్తాడు, అందరికి పంచి పెడతాడు. బ్రహ్మ యజ్ఞమనగా వేదాధ్యయనము. రామాయణ, భాగవతం మొదలగు మహా గ్రంధాలను పఠించడం.

* దేవ యజ్ఞము :- ఇవి భగవదనుగ్రహం కోసం ఇష్టకార్యార్ధ ఫలసిద్ధి కోసం చేస్తారు. గృహస్తులైతే తమ గార్హపత్యాగ్ని ( నిత్యం వెలిగే ప్రసిద్దమైన అగ్ని) లో హవిస్సును సమర్పిస్తారు. బ్రహ్మచారులైతే లౌకికమైన అగ్నితోనే చేస్తారు. ఇతర వర్ణ వర్గాలకు చెందిన వారికి నమస్కారమే దేవ యజ్ఞ ఫలమును ఇస్తుంది. దేవ యజ్ఞమనగా ఆజ్యము, లాజలు ( పేలాలు ) వంటితో హోమం జరిపించుట

* పితృ యజ్ఞము :- ఇవి తమను వదలి పరలోకాలకు చేరిన తమ పితృదేవతల కొరకు చేస్తారు. ఐతే తండ్రి బ్రతికి ఉండగా ఈ యజ్ఞమును చేయుటకు పుత్రునికి అధికారం లేదని పెద్దలు చెబుతారు. పితృ యజ్ఞమనగా శ్రాద్ధము, తర్పణములు మొదలైన కార్యక్రమాలు జరిపి పూర్వీకులను సంతృప్తి పరుచుట.

* భూత యజ్ఞము :- తనతో పాటుగా ఈ భూమి మీద ఉన్న సకల చరాచర జీవరాశులకు ఉపయోగపడేలా తాను నడుచుకోవాలి. భూత యజ్ఞమనగా సకల భూతములకు బలిదానములు ఇచ్చుట.

* నృయజ్ఞము :- ఈ యజ్ఞమునే అతిధి యజ్ఞం అనికూడా పిలుస్తారు. మన ఇంటికి వచ్చిన అతిధిని గౌరవంగా, మర్యాదగా చూసుకోవాలి. ఈ యజ్ఞము ద్వారానే గృహస్తుడు మిగిలిన మూడు ఆశ్రమములవారికి ఆధారం అవుతున్నాడు. నృయజ్ఞమనగా అతిథి పూజాదులు నిర్వర్తించడం.


 

Follow Us:
Download App:
  • android
  • ios