పునర్వసు కార్తె ప్రారంభం... ఏమిటి దీని ప్రత్యేకత..?
ఈ కార్తెల ఆధారంగా వ్యవసాయ దారులు, జానపదులు ( గ్రామీన ప్రాంతం వారు) ఎక్కువగా వీటిపై ఆధారపడి చేయువృత్తులు, వ్యవసాయం సాగు ఈ కాలగణనతో కార్తెల అధారంగా వారి పంటల నిర్ణయం,వ్యవసాయ సాగు చేసుకుంటారు.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
ఈ కార్తెలు ఎలా ఏర్పడతాయో గమనిద్దాం. సూర్యుడు ఏ నక్షత్రంలో అయితే ప్రవేశింస్తాడో ఆ నక్షత్రమాధారంగా నక్షత్రం యొక్క పేరుతో కార్తె పేరును పిలువబడుతుంది.అశ్విని మొదలుకుని రేవతి వరకు మనకున్న ఇరువది ఏడు నక్షత్రాలలో సూర్యభగవానుడు ప్రవేశ ఆధారంగా కార్తెను నిర్ణయించడం జరుగుతుంది.
భారతీయ జ్యోతిష సాంప్రదాయ ప్రకారం ఒక్కో కార్తెలో దానికి సంబంధించి ప్రకృతిలోని మార్పు, దాని వలన జరిగే ప్రత్యేకాంశాలను సవివరంగా వివరించింది.ఈ కార్తెల ఆధారంగా వ్యవసాయ దారులు, జానపదులు ( గ్రామీన ప్రాంతం వారు) ఎక్కువగా వీటిపై ఆధారపడి చేయువృత్తులు, వ్యవసాయం సాగు ఈ కాలగణనతో కార్తెల అధారంగా వారి పంటల నిర్ణయం,వ్యవసాయ సాగు చేసుకుంటారు. సూర్యుడు పునర్వసు నక్షత్రంలో ప్రవేశించిన నాటి నుండి పునర్వసు కార్తె ఏర్పడుతుంది.
పంచాగ ప్రకారం పునర్వసు నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సమయంలోని తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు, శకునాలు తదితర అంశాల ఆధారంగా చేసుకుని ఆ సంవత్సరం యొక్క వర్షన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఈ విధంగా వ్యవసాయదారులకు నిత్యజీవనోపయోగిగా, వ్యవసాయం పనులకు మార్గదర్శకంగా ఈ కార్తెలు ఉపయోగపడుతున్నాయి.
పునర్వసు కార్తె ఫలము :- ఆషాఢ బహుళ పాడ్యమి సోమవారము తేది 6 జులై 2020 రోజున ఉదయం 9 : 20 నిమిషాలకు సూర్యుడు నిరయన పునర్వసు కార్తె ప్రవేశం చేస్తున్నాడు. ఈ ప్రవేశ సమయమునకు ఉత్తరాషాఢ నక్షత్రం , సింహలగ్నం, మహేంద్ర మండలము, నిర్జలరాశి, పుం,స్త్రీ యోగము, మూషిక వాహనము, రవ్వాది గ్రహములు రస, రస, సౌమ్య, రస, వాయు, రస నాడీచారము మొదలగు శుభాశుభాయోగాములచే, 6, 7 మేఘాడంబరము, ఒకచో తుంపురు వర్షము,
8 వాతావరణములో మార్పు, 9, 10 అచ్చటచ్చట ఖండ వృష్టి , 11 , 12 మేఘగర్జనలు, దేశభేధమున జల్లులు,13 గాలిచే మేఘాచ్చన్నము, 14 వాతావరణములో మార్పు, 15, 16 తీరప్రాంతములో వాయు చలనము, 17, 18 అచ్చటచ్చట స్వల్ప జల్లులు. సరాసరిగా ఈ కార్తెలో వర్షభంగయోగములు లేక్కువగానున్నందున వర్షాభావ పరిస్థితి కొనసాగవచ్చును. ఈ కార్తె వివరణ బ్రహ్మశ్రీ చంద్రశేఖర శర్మ సిద్దాంతి పంచాంగము ఆధారంగా వివరించడం జరిగినది.