Asianet News TeluguAsianet News Telugu

ఇపుడు తెలంగాణాలో ఎన్నికలొస్తే ఏమవుతుంది?

  • తెలంగాణా కెసిఆర్ పాలనకు సర్వత్రా  ఆమోదం
  • తెలంగాణాలో ప్రధాని  ప్రభావం నిల్
  • ఇపుడు ఎన్నికలొస్తే టిఆర్ఎస్,ఎంఐఎం తప్ప అంతా  మటాష్
  • అయితే,  ఇదంతా బోగస్ అని కాంగ్రెస్, టిడిపి అనేశాయి
KCR enjoys absolute support in Telangana

ఇపుడు తెలంగాణాలో ఎన్నికలొస్తే ఏమవుతుంది...

ఒక సర్వే ప్రకారం ప్రతిపక్షాలు మాయమయిపోతాయి. టిఆర్ ఎస్ పార్ట అఖండ విజయం లభిస్తుంది. ఈ సర్వేని కాంగ్రెస్, తెలుగుదేశం ఖండించాయి. బోగస్ సర్వే అని ప్రకటించాయి.

 

ఒక ప్రయివేటు ఏజన్సీ  జరిపిన  సర్వే ప్రకారం , ప్రతిపక్షాల గొడవలు, రాద్దాంతాలు, కోదండరాం రైతుల ఉద్యమం ఎలా ఉన్నా, ఉన్న ఫలానా ఎన్నికల నిర్వహిస్తే తెలంగాణా రాష్ట్ర సమితి 109 స్థానాలు వస్తాయట. టిఆర్ఎస్ మిత్ర పక్షం ఎంఐఎం  కూడా ఈ ఎన్నికల్లో చెక్కుచెదరకుండా గట్టెక్కుతుందట. 

 

నష్టపోయేవన్నీ టిఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు విఫలయ్యాయని,   ప్రజలు తెగఇబ్బంది పడిపోతున్నరని వాపోతున్న ప్రతిపక్షాలేని సెంటర్ ఫర్ సెఫాలజీ అనే సంస్థ నిర్వహించిన సర్వే వెల్లడించిందని  ఒక టివి  ప్రసారం చేసింది. ఈ సర్వే ప్రకారం, ఎంఐఎం కు 7 సీట్లు, కాంగ్రెస్ కు మరీ అధ్వాన్నంగా రెండు సీట్లు, బిజెపికి కేవలం ఒక్క సీటే వస్తుందట. తెలంగాణా రాష్ట్రంలో ప్రధాని మంత్రి స్ఫూర్తితో బిజెపి   ఓటేసేందుకు ప్రజలు సిధ్దంగా లేరన్నమాటేనా.

 

ప్రతిపక్షాలకు  ఈ దారుణమయిన పరాజయం ఎదురు కావడానికి కారణం ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు   పాలన జనరంజకంగా ఉండటమేనని ఈ సంస్థ రాష్ట్ర వ్యాపితంగా నిర్వహించిన సర్వేలో తేలింది.

 

సర్వే ప్రకారం కెసిఆర్ సారధ్యంలోనే అభివృద్ధి సాధ్యమని 77.89 శాతం మంది భావిస్తుంటే, కొత్త జిల్లాల ఏర్పాటును 77.93 శాతం సమర్థించారు. ఇపుడు ఎన్నికలు నిర్వహిస్తే, 67.88శాతం టిఆర్ ఎస్ కు మద్ధతునిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కెసిఆర్ ప్రభుత్వం పనితీరు మీద 77.64 శాతం భేష్ అన్నారు.  అన్ని  డిస్టింక్షన్ కొట్టినా సంక్షేమ పథకాల మీద మాత్రం  కొద్దిగా తక్కువగా 58.54 శాతం మార్కులు పడ్డాయి. తెలంగాణా శాసన సభ్యుల పనితీరును 64.25 శాతం మంది ప్రశంసించారు.

సర్వేని తోసిపుచ్చిన కాంగ్రెస్

ఎదురుగాలి భయంలో టీఆర్ఎస్ బోగస్ సర్వేలను మొదలు పెట్టిందని తెలంగాణా పిసిపి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్వేమీద వ్యాఖ్యానిస్తూ చెప్పారు. సర్వే మీద నమ్మకం ఉంటే,ధైర్యం  ఉంటే, ఫార్టీ ఫిరాయించిన 24 మంది శాసన సభ్యలు స్థానాలలో ఎన్నికలు జరిపించి గెలవాలని సవాల్ విసిరారు.

 

"కేసీఆర్ గోబెల్స్ ను మించిపోయారు..రైతులు, యువత, విద్యార్థులు, మైనార్టీల ప్రభుత్వం తీరుపై రగిలిపోతున్నారు.ప్రజల ద్రుష్టి మళ్లించేందుకు కేసీఆర్ తప్పుడు సర్వేలు చేయిస్తున్నారు.ప్రజల్లో భ్రాంతి కల్గించేందుకే. సర్వేలు,"అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్, ఫ్యామిలీకి బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని ఈరోజు ఎన్నికలు జరుగితే కాంగ్రెస్ 80 సీట్లు ఖాయమని ఉత్తమ్ చెప్పారు.

 

అది జేబు సంస్థ చేసిన సర్వే - టిడిపి

 

ఈ సర్వేనులెక్కలోకి తీసుకునేది లేదని టిడిపి శాసనసభా పక్ష నాయకుడు ఎ రేవంత్ రెడ్డి అన్నారు.  " ఈ సంస్థకు  గతంలో సర్వేలు చేసిన అనువమే లేదు. అందునా టిఆర్ ఎస్ జేబు సంస్థ. జేబుసంస్థలు ఏమిచేస్థాయి. భజన చేస్తాయి. సర్వే భజనే" అయనా వ్యాఖ్యానించారు.

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios