2026లో జరగనున్న విలింటర్ ఒలింపిక్స్, పారాలింపిక్స్‌కు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వేదికలను ప్రకటించింది. ఆ ఏడాది వింటర్ ఒలింపిక్స్, పారాలింపిక్స్‌కు ఇటలీ ఆతిథ్యమిస్తుందని అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ అధికారికంగా ప్రకటించారు.

ఫిబ్రవరి 6 నుంచి 22 వరకు వింటర్ ఒలింపిక్స్, మార్చి 6 నుంచి 15 వరకు పారాలింపిక్స్ జరగుతామని.. మిలన్, కార్టినా నగరాలను వేదికలుగా నిర్ణయించినట్లు థామస్ వెల్లడించారు.

కాగా.. ఆటల ఆతిథ్యం కోసం ఇటలీ, స్వీడన్ బిడ్ దాఖలు చేయగా.. ఎక్కువ మంది సభ్యులు ఇటలీకే ఓటేశారు. గతంలో 1956, 2006లో వింటర్ ఒలింపిక్స్ క్రీడలను ఇటలీ నిర్వహించింది