పారాలింపిక్స్‌లో అవని స్వర్ణం, మనీష్ రజతం సాధించగా.. రెండో రోజు 4 మెడల్స్ గెలిచిన భారత్
paris paralympics 2024 : పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో రెండో రోజు భారత ఆటగాళ్లు నాలుగు పతకాలు సాధించారు. ఇందులో ఒక గోల్డ్ మెడల్, ఒక సిల్వర్ మెడల్, రెండు బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. అవని లేఖరా భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించింది.
Paralympics Games Paris 2024 : ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ 2024లో భారత్ అద్భుత ప్రదర్శనలతో మొదలుపెట్టింది. రెండో రోజు ఏకంగా నాలుగు మెడల్స్ గెలుచుకుంది. పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్ క్రీడల్లో రెండో రోజు భారత ఆటగాళ్లు పతకాల మోత మోగించారు. ఇప్పటి వరకు భారత్‌కు నాలుగు పతకాలు గెలుచుకుంది. అవని లేఖరా అద్భుత ప్రదర్శన చేసి భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించడంతో షూటింగ్‌లో భారత్ ఖాతా తెరిచింది. అలాగే, ఆమె సహచరురాలు మోనా అగర్వాల్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ ఈవెంట్ తో రెండు మెడల్స్ వచ్చి చేరాయి. ఆ తర్వాత అవని, మోనాలతో పాటు పురుషుల షూటింగ్‌లో మనీష్ నర్వాల్ రజతం సాధించారు. కాగా, ప్రీతీ పాల్ అథ్లెటిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. దీంతో భారత్ ఖాతాలో నాలుగు పతకాలు చేరాయి. పారాలింపిక్స్‌లో అవనికి ఇది వరుసగా రెండో బంగారు పతకం. టోక్యోలో జరిగిన పారాలింపిక్స్‌లోనూ ఆమె స్వర్ణం గెలిచారు.
భారత్ ఖాతాలో నాలుగు పతకాలు
పారిస్ పారాలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 షూటింగ్ ఫైనల్ ఈవెంట్‌లో అవని లేఖరా బంగారు పతకంతో భారత్ కు తొలి మెడల్ అందించింది. అదే ఫైనల్లో మోనా అగర్వాల్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది. మహిళల 100 మీటర్ల టీ35 ఈవెంట్‌లో ప్రీతీ పాల్ వ్యక్తిగత అత్యుత్తమ సమయం 14.21 సెకన్లతో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఈవెంట్‌లో రజతం సాధించిన మనీష్ నర్వాల్ నాలుగో పతకాన్ని అందించాడు.
అవనికి వరుసగా రెండో గోల్డ్ మెడల్..
అవనీ లేఖరా అద్భుతం చేసింది. వరుసగా రెండో గోల్డ్ మెడల్ సాధించింది. పారిస్ పారాలింపిక్ గేమ్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 షూటింగ్‌లో అవనీ వరుసగా రెండో బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఆమె తన టైటిల్‌ను కాపాడుకోవడంలో విజయం సాధించింది. స్వర్ణం మాత్రమే కాదు, అవ్నీ టోక్యో 2020 పారాలింపిక్ రికార్డును కూడా బద్దలు కొట్టింది. పారాలింపిక్స్‌లో భారత్‌కు మెరుగైన ఆరంభం ఇది. అవనితో పాటు మోనా అగర్వాల్ కూడా అద్భుతంగా షూట్ చేసి భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది.
అవనీ సరికొత్త చరిత్ర
అవనీ లేఖరా ఈ గోల్డ్ మెడల్ తో చరిత్ర సృష్టించింది. పారాలింపిక్స్‌లో భారత్ తరఫున మూడు పతకాలు సాధించిన తొలి మహిళా పారా అథ్లెట్‌గా నిలిచింది. 22 ఏళ్ల అవని టోక్యోలో జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 ఈవెంట్‌లో స్వర్ణం, మహిళల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్ SH1 ఈవెంట్‌లో కాంస్యం సాధించింది. టోక్యోలో పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా కూడా రికార్డు సాధించింది. ఇప్పుడు పారిస్ లో కూడా గోల్డ్ మెడల్ సాధించింది.
ఉత్కంఠభరితంగా ఫైనల్ ఈవెంట్..
ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. 8 మంది మహిళల మధ్య జరిగిన ఈ ఫైనల్లో చివరి షాట్ వరకు అవని లేఖరా రెండో స్థానంలో ఉంది. దక్షిణ కొరియాకు చెందిన లీ యున్రీ ఫైనల్‌లో ముందంజలో ఉన్నారు. అవని నుంచి దాదాపు బంగారు పతకాన్ని లాగేసుకునే స్థానంలో ఉన్నారు. అయితే, తన చివరి ప్రయత్నంలో 6.8 స్కోరు సాధించారు. అవని 10.5 స్కోర్ చేసి బంగారు పతకాన్ని గెలుచుకుంది. అవనీ మొత్తం 249.7 స్కోర్‌ని సంపాదించారు. ఇది పారాలింపిక్ సరికొత్త రికార్డ్. మూడేళ్ల క్రితం టోక్యోలో జరిగిన పారాలింపిక్ లో రికార్డు సృష్టిస్తూ 249.6 స్కోర్ చేరు. ఇప్పుడు దానిని బ్రేక్ చేసింది.
శత్రుదేశాల గుండెల్లో హడల్.. భారత నౌకాదళంలోకి కొత్త అణు జలాంతర్గామి INS Arighat
మోనా కూడా అద్భుతమైన షూటింగ్ తో మెడల్ గెలిచింది
మోనా అగర్వాల్ 228.7తో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 36 ఏళ్ల మోనా అగర్వాల్ కూడా అద్భుత ప్రదర్శన చేసింది. ఫైనల్ ఎలిమినేషన్ రౌండ్‌కు ముందు ఆమె గోల్డ్ మెడల్ పొజిషన్‌లో ఉంది. తన చివరి రౌండ్‌లో తన మొదటి రెండు షాట్‌లలో 10.6 స్కోర్ చేశారు. అయితే, చివరి షాట్‌లో 10 స్కోర్ మాత్రమే చేయడంతో గోల్డ్ మెడల్ ను మిస్సయ్యారు.
Team India : టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. స్టార్ ప్లేయర్లు చేతులెత్తేశారు
- Manish Narwal
- Paralympics Games Paris
- Paralympics Games Paris 2024
- avani lekhara
- avani lekhara creates history
- avani lekhara gold in paris
- avani lekhara gold medal
- avani lekhara shooting
- avani lekhara tokyo olympics
- india paralympics gold medal
- india paralympics medals 2024
- manish narwal paris paralympics
- manish narwal silver
- mona agarwal
- paralympics
- paralympics 2024
- paris paralympics
- paris paralympics 2024
- paris paralympics gold medal
- shooter avani lekhara